dhoom dhaam

ధూంధాం చేసిన దసరా.. నాని కెరియర్ లోనే బాక్సాఫీస్ రికార్డులు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా తన కష్టం ప్రతిభతో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో నాని. “న్యాచురల్ స్టార్” గా పేరుపొందిన నాని తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూ వస్తున్నాడు. సాధారణంగా లవ్ స్టోరీలు, కుటుంబ కథా చిత్రాలలో నాని కనిపించడమే ఎక్కువ అయితే మాస్ లుక్ లో అతన్ని చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతి దసరా సినిమాతో నాని తన విభిన్న పాత్రలో మాస్ లుక్ లో కనిపించి భారీ హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు నాని తన కెరీర్ ప్రారంభంలో “అష్టాచమ్మా ” “అలా మొదలైంది ” “భీమిలి కబడ్డీ జట్టు” వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అతని సహజమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది వీటితో నాని టాలెంట్ కు దారులు తెరిచినప్పటికీ “ఈగ” సినిమాలో తనకు వచ్చిన తక్కువ నిడివి ఉన్న పాత్రతో కూడా నాని తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, దసరా సినిమా తర్వాత నాని కెరీర్ లో ఓ కీలక మలుపు తిరిగింది.

2023లో విడుదలైన దసరా సినిమా నానికి మాస్ లుక్ లో మొదటి ప్రయత్నం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు ఇందులో నానికి జోడీగా కీర్తి సురేష్ నటించింది ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయం సాధించింది దసరా సినిమా ఏప్రిల్ 7 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 100 కోట్ల క్లబ్‌లో చేరింది నాని కెరీర్‌లో ఇదొక ప్రత్యేక ఘట్ట ఈ సినిమా ఆయనకు భారీ హిట్ మాత్రమే కాకుండా నాని రెమ్యూనరేషన్ కూడా గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఈ చిత్రం 2024లో ఐఫా ఉత్తమ తెలుగు సినిమా అవార్డు కూడా దక్కించుకుంది.

“దసరా” సినిమాలో నాని పూర్తిగా విభిన్నమైన మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు దసరా నేపథ్యంతో తెలంగాణ ప్రాంత భాషతో ఒక సాధారణ యువకుడి కథను ప్రాముఖ్యంగా చూపించి నాని తన నటనతో మాస్ హీరోలకు దీటుగా నిలిచాడు ఈ సినిమా విడుదలతో నాని తన కెరీర్ లో కొత్త అధ్యాయానికి తెరలేపాడు దసరా తర్వాత నాని నటనకు కొత్త మలుపు భిన్నమైన పాత్రల ఎంపిక కొనసాగించబోతున్నాడు.

    Related Posts
    2030 వరకు రాజమౌళి సినిమాతో మహేష్ బిజీ.. ఇలా చేయడం జక్కన్నకు న్యాయమేనా
    mahesh rajamouli combo movie updates create tension for fans detailsd

    టాలీవుడ్‌లో హీరోలు దర్శకులకంటే ఎక్కువగా క్రేజ్‌ను సంపాదిస్తారు అనేది సాధారణ అభిప్రాయం హీరోలు ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంటారు కాబట్టి వారి క్రేజ్ దర్శకుల కంటే ఎక్కువగా Read more

    ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ ఇతడే.. ఏకంగా రూ.92 కోట్లు
    FotoJet 20240906T172650143 2024 09 0b8c5bcd01261fcd6d973f8e36846703 3x2 1

    భారతదేశంలో సెలబ్రిటీలను కేవలం వారి ఖ్యాతి, సంపాదన కోసం మాత్రమే కాకుండా, వారు చెల్లించే భారీ పన్నుల కోసం కూడా గుర్తించవచ్చు. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా Read more

    మంచు ల‌క్ష్మి న‌టించిన మూవీ ఎలా ఉందంటే?
    adi parvam

    తెలుగు సినీ పరిశ్రమలో అనేక నూతన కథా చిత్రాలు వస్తున్నప్పటికీ, ఆది పర్వం సినిమాకు ప్రత్యేకమైన ఓ గుర్తింపు ఉంది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన Read more

    అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ కథ ఇదేనా
    allu arjun trivikram

    టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప 2 సినిమా విజయానికి శ్రమిస్తూ, ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *