watchmen

దుబాయి వాచ్‌మెన్‌కి జాక్‌పాట్‌ 2.32కోట్లు

చాలామంది తమ జీవితంలో జాక్‌పాట్ తగలాలని కోరుకుంటారు. దానికోసం కలలు కంటారు. సరిగ్గా ఓ వాచ్‌మెన్‌ జీవితంలో కూడా ఇదియే జరిగింది. దుబాయిలో వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్న హైద‌రాబాదీకి జాక్‌పాట్ త‌గిలింది. ఇటీవ‌ల తీసిన బిగ్ టికెట్ మిలియ‌నీర్ ఎల‌క్ట్రానిక్‌ ల‌క్కీ డ్రాలో ఏకంగా మిలియ‌న్ దిర్హ‌మ్స్ (రూ. 2.32కోట్లు) గెలుచుకున్నాడు. హైద‌రాబాద్‌కు చెందిన రాజ‌మ‌ల్ల‌య్య (60)కు ఈ బంప‌ర్ లాట‌రీ త‌గిలింది. దీంతో అత‌ని ఆనందానికి అవ‌ధుల్లేవు.
30 ఏళ్లుగా అబుదాబిలో నివాసం
హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లికి చెందిన రాజ‌మ‌ల్ల‌య్య గ‌త 30 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. అత‌ని భార్య‌, పిల్ల‌లు ఇక్క‌డే ఉండ‌గా.. ఒంట‌రిగానే అక్క‌డ ఉంటూ, ఫ్యామిలీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు. నాలుగేళ్ల క్రితం స్నేహితుల ద్వారా ఈ బిగ్ టికెట్ మిలియ‌నీర్ లాట‌రీ గురించి తెలుసుకున్నాడు. అప్ప‌టి నుంచి మిత్రుల‌తో క‌లిసి లాట‌రీ టికెట్ కొనుగోలు చేయ‌డం ప్రారంభించాడు. ఇప్పుడు అదృష్టం వ‌రించ‌డంతో ఏకంగా రూ. 2.32 కోట్లు గెలుచుకున్నాడు.

లాటరీ నిర్వాహ‌కుల నుంచి మొద‌ట కాల్ వచ్చినప్పుడు, నేను పూర్తిగా ఆనందంలో మునిగిపోయాను. ఆ స‌మ‌యంలో నేను అనుభవించిన ఆనందాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను.
ఇది నా మొదటి విజయం. ఈ న‌గ‌దు బహుమతిని నా స్నేహితులతో పంచుకుంటాను. నా వాటాగా వ‌చ్చే సొమ్మును నా కుటుంబం భవిష్యత్తు కోసం ఉప‌యోగిస్తాను. ఇక‌పై కూడా లాటరీ టికెట్ కొన‌డం కొనసాగిస్తాను” అని చెప్పుకొచ్చాడు.

Related Posts
అతుల్ ఆత్మహత్య కేసులో పరారీలో భార్య
Atul Subhash Die Suicide

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య పరారీలో ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ (34) ఆత్మహత్య కేసులో పోలీసులు రంగంలోకి దిగారు. Read more

భూ హక్కు లబ్దిదారులకు ప్రాపర్టీ కార్డులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తీపి కబురు వినిపించారు. అర్హులైన లబ్దిదారులకు భూ హక్కు పత్రాలను అందించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా Read more

దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌
The center is good news for the people of the country

ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లకు వచ్చినట్టుగానే 60 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి Read more

బాబా రాందేవ్‌పై అరెస్ట్‌ వారంట్‌
Arrest warrant for Baba Ramdev

తిరువనంతపురం : పతంజతి ఆయుర్వేద్‌ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇస్తోందని దాఖలైన ఫిర్యాదుపై కేరళలోని పాలక్కడ్‌ జిల్లా కోర్టు బాబా రామ్‌దేవ్‌, ఆయన సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణలపై Read more