bhatti

ద‌శ‌ల‌వారీగా భ‌ర్తీ చేస్తాం: భ‌ట్టి

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీపై డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సోమ‌వారం నాడు శాస‌నమండలిలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను ద‌శ‌ల‌వారీగా భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపారు. ఖాళీల‌ను అంచ‌నా వేసి టీజీపీఎస్‌సీ ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.
పదేళ్లు పాలించిన కెసిఆర్ యువతకు పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్యం నిరుద్యోగం నుంచి యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తున్నాము అన్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌శ్న‌ప‌త్రాల లీక్‌, మాల్ ప్రాక్టీస్ జ‌ర‌గ‌కుండా పార‌ద‌ర్శ‌కంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త ప‌దేళ్ల‌లో ఒక్క డీఎస్‌సీ కూడా నిర్వ‌హించ‌లేద‌ని, తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మెగా డీఎస్‌సీ నిర్వ‌హించ‌డంతో పాటు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశామ‌న్నారు. ఉద్యోగార్థులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఉద్యోగాల భ‌ర్తీ కోస‌మే జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. తమ గవర్నమెంట్ ఎవరికి అన్యాయం చేయదని, అందరికి అవకాశాలు కల్పిస్తామన్నారు.

Advertisements
Related Posts
జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 91-ఏ Read more

సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇదేం పాలన ?: బండి సంజయ్
CM Revanth Reddy.. Is this governance?: Bandi Sanjay

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ ఇదేం పాలన? అంటూ బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు . తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో Read more

Etela rajender : ఉస్మానియాలో నిరసనలపై నిషేధం ఎత్తివేయాలి: ఈటల
Ban on protests in Osmania should be lifted .. Etela

Etela rajender : రాష్ట్ర ఏర్పాటులో ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు. వర్సిటీలో నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను Read more

నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ
నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్‌లో Read more

×