దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను పోలీసులు అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టుకు యత్నం చేసిన పోలీసులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో ఆరు గంటల ప్రతిష్టంభన తర్వాత పోలీసులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో అరెస్టును వాయిదా వేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. సుమారు ఆరు గంటల పాటు.. అధ్యక్షుడి భద్రతా సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు.

కొనసాగుతున్న దర్యాప్తు
అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలో యూన్‌పై నిఘా సంస్థలు దర్యాప్తు చేపడుతున్నాయి. దేశంలో మార్షియల్ లాను అమలు చేయాలని గత డిసెంబర్‌లో యూన్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అధ్యక్షుడు యూన్‌పై విపక్షాలు అభిశంసన ప్రకటించాయి. దీంతో దక్షిణకొరియాలో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పలు కేసుల్లో విచారణకు హాజరుకావాలని సియోల్ కోర్టు ఇటీవల ఇచ్చిన సమన్లను యూన్ బేఖాతరు చేశారు. మూడు సార్లు ఆయన సమన్లను విస్మరించారు. దీంతో ఇటీవల సియోల్ కోర్టు.. యూన్ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది.