venkaiah naidu

తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు: వెంకయ్యనాయుడు

తెలుగు భాష కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన భాషను మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగులో మాట్లాడని వారికి ఓటేయొద్దని, తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్‌ వర్సిటీ వేదికగా జరుగుతున్న రెండవ ప్రపంచ మహాసభల్లో ఆయన మాట్లాడారు.


తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు సంబంధించినదే కాదని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగాలని, సినిమా సంబషణలు తెలుగులో ఉండాలని అన్నారు. ఆంగ్లంలో మాట్లాడకపోతే నామోషీ అన్న భావన సరికాదని పేర్కొన్నారు.

అమ్మ భాషను మరిచిపోతే అమ్మను కూడా మరిచిపోయినట్టేనని తెలిపారు. ఇంగ్లిష్‌ భాష వాడుతూ తెలుగు భాషను దిగజారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగు మాట్లాడుతున్నారని, మన భాషను మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామని ప్రశ్నించారు.

Related Posts
భూకబ్జాలకు జైలుశిక్ష: చంద్రబాబు
భూకబ్జాలకు జైలుశిక్ష: చంద్రబాబు

భూకబ్జాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం, కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో జరిగిన రెవెన్యూ సమావేశంలో మాట్లాడారు. ఒక్క సెంటు భూమి Read more

ఏపీలో కొత్తగా 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
Establishment of 63 new can

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కొత్తగా 63 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా Read more

డ్రోన్ టెక్నాలజీ..ఫ్యూచర్ గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

అమరావతి : మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన 'అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంక్షోభ సమయంలో Read more

వైస్ షర్మిల కు వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి
sharmila dharna

కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రారెడ్డి భార్య కల్యాణి.. వైఎస్ షర్మిళను తీవ్రస్థాయి లో హెచ్చరించారు. కడప జిల్లా పోలీసులు వర్రా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *