257418 police

తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు

వినాయక నిమజ్జనంలో ఏఐ టెక్నాలజీ వినియోగానికి పురస్కారం

హైదరాబాద్‌, డిసెంబరు 17 : వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఈ ఏడాది గణేష్‌ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(జీఐఎస్‌) వినియోగించారు. భారీ సమావేశాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించారు. తొక్కిసలాట జరగకుండా ఏఐ టెక్నాలజీతో అనుసంధానమైన డ్రోన్లను వినియోగించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన ఈ విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది.

ప్రజారక్షణలో ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్న ప్రభుత్వాలు, సంస్థలకు.. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఐఎ్‌సజీ, సీఎన్‌బీసీ-టీవీ18 సంస్థలతో కలిసి అవార్డులు అందించగా.. డిజిటల్‌ ఇంజినీరింగ్‌ అవార్డులలో చాలెంజర్‌ క్యాటగిరీలో అత్యుత్తమ స్థిరత్వ కార్యక్రమ(టాప్‌ సస్టెయినబిలిటీ ఇనిషియేటివ్‌) పురస్కారం తెలంగాణ పోలీసు శాఖకు ప్రకటించారు. ఈ క్యాటగిరీలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 230 నామినేషన్ల నుంచి తెలంగాణ పోలీసులకు పురస్కారం దక్కింది. స్మార్ట్‌ సిటీ టెక్నాలజీలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రామాణికాలను నిర్దేశించిందని అవార్డుల కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డు దక్కడంపై అదనపు డీజీపీ వి.వి.శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వినియోగానికి ఈ పురస్కారం దక్కడం మరింత ప్రోత్సాహాన్ని అందించిందని అన్నారు.

Related Posts
బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్.. !
BRS leader Errolla Srinivas arrested.

హైదరాబాద్‌: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కేసు Read more

ఉగాది పండుగ కానుకగా సన్నబియ్యం పంపిణీ
ఉగాది పండుగ కానుకగా సన్నబియ్యం పంపిణీ

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న ప్రభుత్వము, ఈసారి ఉగాది పండుగ కానుకగా Read more

అరెస్ట్‌ వార్తలపై కేటీఆర్ ట్వీట్
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: తనపై నమోదైన కేసులపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గుడ్ లక్ చిట్టినాయుడు అంటూ కేటీఆర్‌ చురకలు అంటించారు. శునకానందం పొందాలనుకుంటే.. నీ Read more

హైడ్రాకు మరో అధికారం..
hydraa ranganadh

అక్రమ నిర్మాణాల ఫై ఉక్కుపాదం మోపేలా రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ కు అనేక ఆదేశాలు ఇవ్వగా..తాజాగా మరో అధికారం Read more