Revanth reddy

తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్స్ వరకు అనుమతి ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తక్కిసలాట జరగడం, ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇప్పటికీ కోమలోనే మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తుతో చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
“నేను సినీ ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి షూటింగ్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలను ఉపేక్షించను. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదు” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Advertisements

Related Posts
వయనాడ్ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్
Navya Haridas against Congr

కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. నవ్య హరిదాస్ పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ స్థానానికి కాంగ్రెస్ Read more

యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలకు సీఎం కీలక ఆదేశాలు
CM Revanth Reddy to Youth Congress and NSUI leaders

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి హైదరాబాద్‌: గ్యాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సి వ్యూహాలపై శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ Read more

ఐఐటీ బాంబేతో ఎస్ఆర్ఐ – నోయిడా అవగాహన ఒప్పందం..
Samsung agreement on digita

అత్యాధునిక పరిశోధనలను నిర్వహించడం, డిజిటల్ ఆరోగ్యం , కృత్రిమ మేధస్సులో తదుపరి తరం సాంకేతికతలను అభివృద్ధి చేయడాన్ని ఈ ఐదేళ్ల భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సహకారం Read more

హైదరాబాద్ లో గ్రాండ్ గా యమహా కామిక్ కాన్ లాంచ్
Yamaha Grand Debut at Comic

ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ 15 నవంబర్ 2024 నుండి 17 నవంబర్ 2024 వరకు హైదరాబాద్‌లో జరిగే కామిక్ కాన్ ఇండియా అనే దేశంలోని Read more

×