Pushpa 2

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు

టాలీవుడ్‌కు తీరని షాక్‌ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల ప్రాణాలకు మించినవి ఎలాంటి వసూళ్లూ కాదని అసెంబ్లీలో స్పష్టం చేశారు. సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సిద్ధమైన పెద్ద సినిమాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు రికార్డు కలెక్షన్లపై కలలు కన్న నేపథ్యంలో, ఈ నిర్ణయం వారి వ్యూహాలను తారుమారు చేసింది.తెలంగాణ సర్కారు నిర్ణయం సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలపై గట్టి ప్రభావం చూపనుంది.పుష్ప 2కి ఇంతవరకు తెలంగాణలో టికెట్ ధరల పెంపు, పేమెంట్ ప్రీమియర్‌ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల రికార్డు వసూళ్లు సాధించగలిగింది.కానీ, రానున్న సినిమాలు ఈ వెసులుబాటును ఆశించలేవు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత “గేమ్ ఛేంజర్”లాంటి భారీ బడ్జెట్ సినిమాలు, “డాకూ మహారాజ్” వంటి సినిమాలకు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బగా మారింది.”పుష్ప 2″ టికెట్ రేట్లు పెంచి, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల తొలి రోజే రూ.294 కోట్ల వసూళ్లు సాధించింది.

ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది.కానీ ఇప్పుడు ఇదే ఫార్ములా ఇతర సినిమాలకు అందుబాటులో లేకపోవడం, సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలను ఆర్థికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన “గేమ్ ఛేంజర్” మూవీకి ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కానీ, తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయం ఈ సినిమాకు భారీ వసూళ్లు సాధించడంలో ప్రతికూల ప్రభావం చూపనుంది.నందమూరి బాలకృష్ణ నటించిన “డాకూ మహారాజ్” కూడా సంక్రాంతి బరిలో ఉంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా, టికెట్ రేట్లు పెంపు లేకుండా పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించడం కష్టమే.

Related Posts
లైలా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ?
లైలా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్

లైలా బాక్సాఫీస్ వద్ద మొదటి 1 రోజుల్లో మంచి ప్రదర్శన కనబరిచింది మరియు అంచనా వేయబడిన ₹ 1.25 కోట్ల భారత నికర ఆర్జించింది. లుగు సినిమా Read more

Chiranjeevi: కర్ణాటక ఎమ్మెల్యే రక్తదానం… తన నివాసంలో అభినందించిన చిరంజీవి
chiranjivi

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఈ రోజు హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ప్రదీప్ ఈశ్వర్ చిక్ బళ్ళాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి Read more

గాయని కల్పన ఆత్మహత్యాయత్నం – తాజా సమాచారం
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం: అసలు కారణం ఏమిటి?

ప్రముఖ గాయని కల్పన మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలో ఉండగా, హైదరాబాదులోని KPHB హోలిస్టిక్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. Read more

గీతా ఆర్ట్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ – “ఛావా” తెలుగు వెర్షన్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్‌లో "ఛావా" సినిమా ఎప్పుడొస్తుందో తెలుసా?

RELEASING ON MARCH 7TH 2025 ఛావా" తెలుగు రిలీజ్ – గీతా ఆర్ట్స్ భారీ ప్రాజెక్ట్ కు సిద్ధం! "ఛావా" – బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ Read more