Global Climate Action Movem

తెలంగాణలో ప్రారంభమైన గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ మూవ్‌మెంట్ ‘1.5 మేటర్స్’

తెలంగాణ, 6 డిసెంబర్ 2024 : 1M1B (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) ద్వారా ఈరోజు ప్రారంభించబడిన 1.5 మేటర్స్ దేశవ్యాప్త వాతావరణ కార్యాచరణ కార్యక్రమం. ఈ వినూత్న కార్యక్రమం, భారతదేశ వాతావరణ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, విద్యాసంస్థలు మరియు వినూత్న ఛేంజ్ మేకర్స్ ను ఏకతాటి పైకి తీసుకురావడానికి ఒక పరివర్తన క్షణాన్ని సూచిస్తుంది.

పారిస్ ఒప్పందం ప్రకారం, వాతావరణ మార్పుల యొక్క అత్యంత తీవ్రమైన ప్రభావాలను తగ్గించడానికి దేశాలు ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5 ° C లోపల పరిమితం చేయడానికి కట్టుబడి ఉన్నాయి. హైదరాబాద్‌లోని టి-వర్క్స్‌లో జరిగిన అత్యున్నత స్థాయి కార్యక్రమంలో 1.5 మేటర్స్ ఆవిష్కరించబడింది, ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో రాష్ట్రం యొక్క దృఢ నిబద్ధతను సూచిస్తూ, 1.5 మేటర్స్ కార్యక్రమానికి మద్దతు ఇస్తానని నిర్ణయాత్మక ప్రతిజ్ఞ చేస్తూ తెలంగాణ నుండి ప్రభావవంతమైన నాయకులను మరియు 10,000 మందికి పైగా పౌరులను ఒకచోట చేర్చింది.

ప్రతి రాష్ట్ర-హబ్‌లు వాతావరణ మార్పుల కోసం వాతావరణ ఆవిష్కరణ, భాగస్వామ్యం మరియు కార్యాచరణ పరిష్కారాల కోసం కీలకమైన కేంద్రంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ‘ 1.5 మేటర్స్’ ప్రారంభంతో, రాష్ట్రం నేతృత్వంలోని కార్యక్రమాలు ప్రపంచ స్థాయిలో ప్రభావవంతమైన మార్పును ఎలా నడిపించగలవని, దూరదృష్టితో కూడిన నాయకత్వం మరియు సమిష్టి కార్యాచరణ ద్వారా స్థిరమైన పురోగతిని సాధించవచ్చని తెలంగాణ నిరూపిస్తోంది.

“ఇది సాంప్రదాయ సరిహద్దులను అధిగమించే భారతదేశపు మొదటి వేదిక ” అని 1.5 మేటర్స్ క్యూరేటర్ మరియు 1M1B వ్యవస్థాపకుడు మానవ్ సుబోధ్ అన్నారు. “మేము కేవలం ఉద్యమాన్ని సృష్టించడం లేదు; మేము మన దేశం అంతటా వాతావరణ చర్య యొక్క ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాము. మా దేశవ్యాప్త హబ్ సిరీస్ భారతదేశ వాతావరణ పరివర్తనకు హృదయ స్పందనగా ఉంటుంది” అని జోడించారు.

తెలంగాణ ప్రభుత్వ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, పరిశ్రమలు & వాణిజ్య శాఖల గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “తెలంగాణ పర్యావరణ అనుకూల స్థిరమైన భవిష్యత్తు దిశగా సాహసోపేతమైన అడుగులు వేయడానికి కట్టుబడి ఉంది. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఇతర నగరాలు ఎదుర్కొంటున్న సవాళ్లను మనం చూస్తున్నాము : తీవ్రమైన వాయు మరియు నీటి కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ మరియు నీటి కొరత వంటివి ఇప్పటికే చాలా చోట్ల కనిపిస్తున్నాయి. వేగవంతమైన మరియు తరచుగా నిర్వహించని అభివృద్ధి కారణంగా ఇది ఉత్పన్నమైంది. ఈ ఆపదలను నివారించడానికి, వాతావరణం మరియు పర్యావరణ పరిగణనలతో అభివృద్ధిని సమతుల్యం చేయడం యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. ఈ కార్యక్రమం 1.5 మేటర్స్ ప్రచారాలు మరియు నాయకత్వ ఫోరమ్‌లలో భాగంగా ఉంది, ఇది తెలంగాణకు బలమైన క్లైమేట్ టాలెంట్ పూల్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది మరియు దాని యువతను ప్రపంచ వాతావరణ ప్రచారకులుగా తీర్చిదిద్దుతుంది” అని అన్నారు.

ఈ కార్యక్రమం మూడు కీలక స్తంభాలను పరిచయం చేసింది:

  1. యాక్షన్-ఓరియెంటెడ్ క్యాంపెయిన్‌లు: వాతావరణ స్పృహను కొలవగల చర్యలుగా మార్చే లక్ష్య అవగాహన ప్రచారాల శ్రేణి, నిర్దిష్టమైన, సైన్స్-ఆధారిత లక్ష్యాలకు సంస్థలను కట్టుబడి ఉండే విలక్షణమైన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని కలిగి ఉంటుంది.
  2. లీడర్‌షిప్ ఫోరమ్‌లు: నిరూపితమైన వాతావరణ పరిష్కారాలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను పంచుకోవడానికి, పలు రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి సి-సూట్ ఎగ్జిక్యూటివ్‌లు, సస్టైనబిలిటీ నిపుణులు మరియు ఇన్నోవేషన్ లీడర్‌ల రెగ్యులర్ సమావేశం.
  3. పరిశ్రమ-మొదటి సస్టైనబిలిటీ ఆడిట్ మరియు బ్యాడ్జ్ సిస్టమ్: టెక్ క్యాంపస్‌ల కోసం పటిష్టమైన పర్యావరణ అంచనా కార్యాచరణ , ప్రతిష్టాత్మకమైన టైర్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (సిల్వర్, గోల్డ్, ప్లాటినం)ను కలిగి ఉంటుంది, ఇది పర్యావరణ శ్రేష్ఠతను గుర్తించి రివార్డ్ చేస్తుంది.

ప్రారంభోత్సవ కార్యక్రమం నుండి ముఖ్యాంశాలు:

డిసెంబర్ 12, 2024న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరగనున్న 1M1B యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో తెలంగాణ నిబద్ధతను ప్రదర్శించడానికి ఎంపికైన ఐదుగురు అసాధారణమైన యువ ప్రతినిధుల విజయాలను కూడా ఈ సమావేశం వేడుక జరుపుకుంది. డిసెంబరు 2023లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రారంభించిన 1M1B గ్రీన్ స్కిల్స్ అకాడమీ ద్వారా ఈ యువ చేంజ్ మేకర్స్ ఎంపిక చేయబడ్డారు. విద్యార్థులను ప్రశంచించిన మంత్రి , ఆవిష్కరణ మరియు నాయకత్వానికి సంబంధించి తెలంగాణ స్ఫూర్తికి వారి ప్రాతినిధ్యం వహిస్తుండటం పట్ల గర్వాన్ని వ్యక్తం చేశారు. 1M1B సమ్మిట్‌లో వారు పాల్గొనడం వల్ల భవిష్యత్ తరాలను వాతావరణం కోసం చర్యలు తీసుకునేలా మరియు పర్యావరణ అనుకూల సుస్థిర భవిష్యత్తుకు మద్దతు ఇవ్వడానికి ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు.

గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉండటంతో పాటుగా వ్యాపారాలు అర్ధవంతమైన వాతావరణ పరిరక్షణ చర్యను ప్రదర్శించడానికి ఒత్తిడిని ఎదుర్కొంటున్న కీలక సమయంలో ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడుతుంది మరియు వారి పర్యావరణ కట్టుబాట్లను అంచనా వేయడానికి, మెరుగుపరచడానికి మరియు ప్రదర్శించడానికి నిర్మాణాత్మక మార్గాన్ని 1.5 మేటర్స్ అందిస్తుంది.

Related Posts
సిగ్గులేని రేవంత్ అంటూ కేటీఆర్ ఫైర్
ktrrevanth

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. "సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు" అన్న సామెతను Read more

డిసెంబర్ 5న కొలువుదీరనున్న మహారాష్ట్ర సర్కారు..?
The government of Maharashtra

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 218 సీట్లతో 'మహాయుతి' కూటమి అఖండ విజయం ఖాయమైంది. దీంతో ఓవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఈసారి ఎవరిని వరించబోతోందనే చర్చ Read more

Sunrisers Hyderabad: 6.4 ఓవర్లలో 100 పరుగులు చేసిన సన్ రైజర్స్
Sunrisers Hyderabad: సన్ రైజర్స్ బ్యాటింగ్: 6.4 ఓవర్లలోనే 100 పరుగుల ఘనత

గత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాదు బ్యాట్స్‌మన్‌లు అత్యద్భుత ప్రదర్శన చూపించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లోనూ వారు తమ మార్కు స్టైల్‌ను Read more

సోషల్ మీడియా వయస్సు నిర్ధారణ కోసం బయోమెట్రిక్స్: ఆస్ట్రేలియా
Australia PM

"16 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు గల వ్యక్తులు సోషల్ మీడియా ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడదు", అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంతోనీ ఆల్బనీస్ సోమవారం తెలిపారు. Read more