srinivas

తెలంగాణపై వివక్ష వద్దు: శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదాస్వాద వ్యాఖ్యలు చేసారు. దేవుడి ముందు అందరూ సమానమేనని… వివక్ష చూపడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు.
సౌకర్యాలను కొనసాగించండి
తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనని అన్నారు. వ్యాపారాల్లో, పదవుల్లో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ప్రపంచంలోనే పేరుపొందిన ఆలయం అని ఇంత పవిత్రత కలిగిన ఆలయంలో వివక్ష చూపడం సరికాదని ఆయన అన్నారు.

Related Posts
చింతల్ బస్తీలో హైడ్రాపై దానం నాగేందర్
చింతల్ బస్తీలో హైడ్రాపై దానం నాగేందర్

బుధవారం మధ్యాహ్నం చింతల్ బస్తీ షాదన్ కళాశాల సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతుండగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకొని అధికారులపై గట్టిగా స్పందించారు. Read more

కొండా సురేఖపై కేటీఆర్‌ పరువునష్టం దావా.. నేడు కోర్టులో విచారణ
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

హైదరాబాద్‌: స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరువునష్టంపై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. తన Read more

కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ షాక్
ycp kamalapuram

వైసీపీ అధినేత జగన్ కు వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలంతా రాజీనామా చేస్తూ టీడీపీ , జనసేన Read more

తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు ఆకస్మిక వరదలు
cyclone 1

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఫెంగాల్ తుఫాను వణికిస్తోంది. ముఖ్యంగా తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోని పలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *