rain ap

తీరం దాటిన పెంగల్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను మహాబలిపురం దగ్గరలో శనివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుఫాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం తుఫాను అత్యంత నెమ్మదిగా కదులుతున్నదని.. గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లుగా పేర్కొంది. పూర్తిగా తీరం పైకి వచ్చి తర్వాత బలహీనపడే అవకాశం ఉందని.. రాత్రి 11.30 గంటల సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. అల్పపీడనం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కి. మీ వేగంతో గాలులు వీస్తాయి. మధ్యలో గంటకు 75 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. తుపాను నేపథ్యంలో, ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిరంతరం ఏపీ సర్కార్​కు నిరంతరం సంకేతాలను అందిస్తోంది. ఇండియాకు చెందిన ఇన్సాట్​-3డీఆర్​, ఈవోఎస్​ -06 శాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు పెంగల్​​ తుపాను స్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్రో అందిస్తోంది. దీంతో విపత్తుల కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇస్రో, ఏపీ గవర్నమెంట్​ను అలర్ట్​ చేయగా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా తమిళనాడులోని ఏడు తీర ప్రాంతాల్లో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీచేసింది. తుపాను పుదుచ్చేరి తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సబర్బన్ పరిధిలోని అన్ని లోకల్ రైళ్ల సర్వీసులను కుదించారు. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. చెన్నైతోపాటు సమీపంలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, మయిలదుతురై, నాగపట్టణం, తిరువూరు వంటి డెల్టా జిల్లాల్లో ఈ ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రోడ్లపై ప్రజా రవాణాను ప్రభుత్వం నిలిపివేసింది. తమిళనాడు వ్యాప్తంగా 2,220 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 మందిని వాటిలోకి తరలించారు.

Related Posts
టన్నెల్ ప్రమాదం.. బురదతో రెస్క్యూకు అంతరాయం
slbc

తెలంగాణలోని SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ తీవ్రంగా కొనసాగుతోంది. టన్నెల్ లోపల 14 కిలోమీటర్ల లోతులో బాధితులు ఉన్నట్లు గుర్తించబడింది. Read more

అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని పవన్ సూచన

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు హృదయపూర్వక సందేశం ఇచ్చారు. బహిరంగ లేఖ ద్వారా పవన్ కల్యాణ్ పార్టీ Read more

బిపిన్ రావ‌త్ మృతిపై లోక్‌స‌భ‌లో రిపోర్టు
Report on Bipin Rawat death in Lok Sabha

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని కూనూరులో త్రివిధ ద‌ళాధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న‌ ఎంఐ 17 వీ5 హెలికాప్ట‌ర్ 2021 డిసెంబ‌ర్ 8వ తేదీన ప్ర‌మాదానికి గురైన విష‌యం Read more

ప్రతీ అడుగులో ప్రమాదం: UKకి చేరుకోవాలనుకున్న అఫ్ఘన్ల సాహసం
afghans

ఆఫ్ఘనిస్తాన్ నివసిస్తున్న ప్రజలు, తమ ప్రస్తుత జీవన పరిస్థితుల నుండి బయట పడటానికి తీవ్రంగా పోరాడుతున్నారు. తమ ప్రాణాలను పడగొట్టి, ఆఫ్ఘనిస్తాన్ నుండి బ్రిటన్ (UK) కు Read more