ttd temple

తిరుమల మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

టీటీడీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. కాగా తిరుపతి తొక్కిసలాటలో మృతిచెందిన వారికి ఏపీ ప్రభుత్వం భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. కాగా.. తిరుపతి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను రుయా ఆస్పత్రి వద్ద రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనాయణ రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే బాధ్యతారాహిత్యంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అవడంతో.. వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో పోలీసులు తరలిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశికి ముందు ఇలాంటి ఘటన దురదృష్టకరమని మంత్రులు అన్నారు. అలాగే తొక్కిసలాటపై తిరుపతి పోలీసులకు తహసీల్దార్‌ ఫిర్యాదు చేశారు. బైరాగిపట్టడి రామానాయుడు స్కూల్‌ దగ్గర జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ కోరారు. అలాగే మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకోనున్నారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించనున్నారు.

Related Posts
ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు
online certificate

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి సర్టిఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇది విద్యార్థులు, వారి Read more

వెలగపూడిలో స్థలం కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు
CM Chandrababu is coming to Hyderabad today

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత నివాసం కోసం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి స్థలం కొనుగోలు చేశారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ స్థలం Read more

తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్
తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు భారీ స్థాయిలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. Read more

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు – మంత్రి కొలుసు
kolusu parthasarathy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, మే, జూన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *