ttd

తిరుమలలో బయటపడ్డ భద్రత డొల్లతనం

తిరుమలలో భద్రతా వైఫల్యంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తోంది. తిరుమలకు చేరుకునే ముందు అలిపిరి వద్దే భద్రతా సిబ్బంది అన్ని వాహనాలను నిలిపివేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాహనంలో అనుమానంగా ఏమైనా ఉన్నా, నిషేధిత వస్తువులు ఉన్నా వాటిని తొలగించిన తర్వాతే తిరుమల కొండపైకి ఆ వాహనాలను అనుమతిస్తుంటారు. కానీ తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు చేసిన నిర్వాకంతో తిరుమల భద్రతలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. తిరుమలలో మాంసాహారం నిషేధం వున్నదని అందరికి తెలిసిందే. కానీ తమిళనాడుకు చెందిన భక్తులు ఏకంగా తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ భక్తులు.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి నిషేధిత ఆహారంతో కొండకు వచ్చారా?.. లేక భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వ్యవహరించారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి తమిళనాడు భక్తులు చేసిన పనికి తిరుమల భద్రతా సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. అయితే నిషేధిత తినుబండారాలతో తిరుమలకు చేరుకున్నారు ఆ భక్తులు. కోడి గుడ్లు, పలావ్‌తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు భక్త బృందం. అలిపిరి టోల్ ప్లాజాలో సెక్యూరిటీ తనిఖీ దాటుకొని నిషేధిత ఆహార పదార్థాలతో భక్త బృందం తిరుమలకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాంభగిచ్చ బస్టాండ్ ఆవరణలో కొందరు భక్తులు కోడిగుడ్డు, పలావ్ తినడాన్ని గుర్తించిన ఇతర భక్తులు.. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకొన్న పోలీసులు.. భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధమని భక్త బృందాన్ని పోలీసులు మందలించారు. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతలోని డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Related Posts
రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్ రావు
masthan rao

ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు Read more

ఏపీలో మరోవారంలో భారీ వర్షాలు
rain ap

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాయలసీమ Read more

బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి
amrapali kata

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం ఇటీవల అమ్రపాలి రాష్ట్రానికి వచ్చి రిపోర్టు Read more

8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi to lay foundation stones for various development works in Anakapalle on Jan 8

ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *