sabarimala

తిరుపతి ఘటనతో శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం!

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది చనిపోవడం దేశంలోని సంచల వార్తగా మారింది. దీనితో మకరజ్యోతి దర్శనం వేళ భక్తుల సంఖ్య అనూహ్యంగా ఉండటంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి ఘటన తరువాత ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ టికెట్ల సంఖ్యను తగ్గించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలు నిర్ణయాలు అమలు చేస్తున్నారు. టికెట్ల జారీ పైన ప్రకటన చేసారు. తాజాగా శబరిమల యాత్రీకులకు భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.


శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మకరజ్యోతి దర్శనం కోసం లక్షలాది భక్తులు శబరిమల చేరుకున్నారు. తాజాగా తిరుపతి ఘటన నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తుల రద్దీ పెరిగినా.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆన్‌లైన్ టికెట్ల సంఖ్యను తగ్గించిన అధికారులు ఈ రోజు, రేపు ఇచ్చే టికెట్ల గురించి స్పష్టత ఇచ్చారు.
తాజాగా, శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రీకులు అందరికీ ట్రావెన్​కోర్ దేవ స్వం బోర్డ్ (టీడీబీ) రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పింస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం 13,600 మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించారు.2,500 మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ని విధుల్లో కేటాయించారు. అదే విధంగా యాత్రీకల కోసం పంబ, అప్పాచిమేడు, సన్నిధానం సహా సమీపంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. యాత్రీకుల కోసం ఎస్ఎంఎస్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రేపు (మంగళవారం) సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు..మకరజ్యోతి దర్శనం కలగనుంది. తిరుపతి ఘటన..గత విషాదాలతో ఈ సారి దేవస్థాన అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఏ చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా అన్ని విభాగాలను అప్రమత్తం చేసారు.

Related Posts
ఢిల్లీ తొక్కిసలాట ఘటన పై కేటీఆర్ రియాక్షన్
432685 delhi12

ఢిల్లీలో జరిగిన భయానక తొక్కిసలాట ఘటనపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి Read more

భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
Huge encounter.. 11 Maoists killed

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో భ‌ద్రతా బ‌ల‌గాలు బుల్లెట్ల Read more

అమెరికా కలల కోసం కోట్లు ఖర్చు!
immigrants from usa

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నారు . హామీలలోని భాగంగా అమెరికా నుండి భారత్ కు బుధవారం Read more

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన సీఎం రేఖా గుప్తా
CM Rekha Gupta met the President and Vice President

ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సీఎం రేఖా గుప్తా న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ Read more