త‌ల్లితో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్‌

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాలుగు రోజుల క‌డప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో జరిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో త‌న త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌ల్లి చేయి ప‌ట్టుకుని కేక్ క‌ట్ చేయించారు. కుమారుడిని ద‌గ్గ‌రకు తీసుకుని త‌ల్లి విజ‌య‌మ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. అంత‌కుముందు క్రిస్మ‌స్ వేడుక‌ల కోసం చ‌ర్చికి చేరుకున్న జ‌గ‌న్‌కు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇక ఇడుపుల‌పాయ ప్రేయ‌ర్‌ హాల్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. గురు, శుక్ర‌వారం కూడా మాజీ సీఎం క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా, క్రిస్మ‌స్ వేడుక‌ల సంద‌ర్భంగా కొత్త‌ సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.

Related Posts
బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి ?
బర్డ్ ఫ్లూ భయం – పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం, వ్యాప్తి, నివారణ మార్గాలు

బర్డ్ ఫ్లూ భయం – పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం, వ్యాప్తి, నివారణ మార్గాలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? బర్డ్ ఫ్లూ (Avian Influenza) ఒక వైరల్ Read more

NDRF సేవలు ప్రశంసనీయం – చంద్రబాబు
CBN NDRF

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా క్లిష్ట సమయాల్లో NDRF అందించే Read more

తిరుపతిలో ప్రారంభమైన టెంపుల్‌ ఎక్స్‌పో
Temple Expo started in Tirupati

ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు తిరుపతి : తిరుపతిలో ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూడు Read more

ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై పిడి యాక్ట్ : మంత్రి కొల్లు రవీంద్ర
kollu

మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక విధానంలో జరుగుతున్న మార్పులు, గత ప్రభుత్వ కాలంలో జరిగిన తప్పిదాలు, మరియు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించి వివరణ ఇచ్చారు. గత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *