Sundeep Kishan Gifts A Cost

తల్లికి కాస్టలీ కార్ గిఫ్ట్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్

వరుస ఫ్లాప్స్ చూసిన హీరో సందీప్ కిషన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఊరిపేరు భైరవకోన, రాయన్ మూవీస్ తో హిట్స్ కొట్టి త్వరలోనే మజాకా మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఓ వైపు మూవీస్ లో బిజీగా ఉంటూనే ఇంకో వైపు బిజినెస్ చేస్తున్నాడు. తాజాగా, సందీప్ కిషన్ ఇంస్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

సందీప్ కిషన్ తన తల్లితండ్రులు, కొత్త కార్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. మా అమ్మకు పుట్టిన రోజు గిఫ్ట్. ఇప్పటికి మా అమ్మ ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేయడానికి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రోజూ వెళ్తుంది. ఒక కొడుకుగా నన్ను మా అమ్మ ఒక కార్ కొనిమ్మని మాత్రమే అడిగింది. ఈ చిన్న గోల్స్ పెద్ద సంతోషాన్నిస్తాయి అంటూ పోస్ట్ చేసాడు. దీంతో సందీప్ కిషన్ తన తల్లికి బర్త్ డేకు కార్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ కార్ ధర రూ. 80 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. దీంతో, సందీప్ కిషన్ ను అభిమానులు, నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

‘స్నేహగీతం, ప్రస్థానం’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్‌ 3 చిత్రాల్లో ఒకటైన ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాడు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్‌ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్న సందీప్‌ తెలుగు వాడు. తెలుగులో ‘ఎల్‌.బి.డబ్యూ’ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో మిక్కీ.జే.మేయర్‌ సంగీత దర్శకత్వంలో రూపోందుతున్న రోటీన్‌ లవ్‌స్టోరిలో సోలో హీరోగా చేస్తూ తమిళంలో రెడ్‌పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుటున్న ‘యారుడ మహేష్‌’ అనే చిత్రం కూడా చేస్తుండడం విశేషం.

Related Posts
‘హరిహరవీరమల్లు’ నుంచి బిగ్ అప్డేట్
HVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. 'హరిహరవీరమల్లు' మూవీ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు Read more

టాలెంట్‌లో తగ్గేదేలే అంటోన్న మహేష్ ఫ్యాన్స్.. ఎస్ఎస్ఎంబి29 యూనిక్ పోస్టర్ అదుర్స్
ssmb29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే "SSMB 29" (వర్కింగ్ టైటిల్) సినిమా కోసం భారీగా ఆసక్తి Read more

బాలయ్యకు పద్మభూషణ్..చంద్రబాబు , ఎన్టీఆర్ అభినందనలు
balakrishna padmabhushan2

నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో Read more

దిల్ రాజు vs తెలంగాణ ప్రభుత్వం
దిల్ రాజు vs తెలంగాణ ప్రభుత్వం

తెలుగు చిత్ర పరిశ్రమ vs తెలంగాణ ప్రభుత్వం: దిల్ రాజు కీలక పాత్ర పోషించగలరా? దిల్ రాజు vs తెలంగాణ ప్రభుత్వం, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం Read more