gas leak tamilanadu

తమిళనాడులో కెమికల్ గ్యాస్ లీకేజీ..

తమిళనాడులోని తిరువొత్తియూరులో ఉన్న మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో కెమికల్ గ్యాస్ లీక్ జరిగి, కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు.

జాతీయ విపత్తుల స్పందన బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఘటనను పరిశీలించినప్పటికీ, ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పాఠశాల ల్యాబ్ నుండి ఎలాంటి గ్యాస్ వెలువడలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద సమయంలో, విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి కళ్లలో చికాకు, మరికొందరు అకస్మాత్తుగా వికారంగా ఉన్నారని చెప్పారు.

విద్యార్థులు మాట్లాడుతూ, “గాలి కోసం కొన్ని మంది క్లాస్ నుంచి బయటకు పరుగెత్తారు. ఉపాధ్యాయులు కూడా ఇబ్బందిపడ్డారు. కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు” అన్నారు. చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఫిర్యాదు చేయడంతో, స్కూల్ యాజమాన్యం అంబులెన్స్‌లు పిలిచి విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడంతో, పలువురు ఔట్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. స్కూల్ నుంచి లీకేజీ జరిగిందా లేక కెమికల్ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం నుంచి వచ్చిందా అనే దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన ముగ్గురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, దాదాపు 30 మంది విద్యార్థులు అసౌకర్యం మరియు గొంతునొప్పితో ఫిర్యాదు చేశారు. అనుమానిత రసాయన వాయువు లీకేజీకి సంబంధించిన కారణాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.

Related Posts
సీగ్రమ్స్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజికల్ ఉత్సవం..
Seagram Royal Stag Boom Box Musical Festival

‘లివింగ్ ఇట్ లార్జ్’ స్ఫూర్తికి చిహ్నంగా హైదరాబాద్‌లో బోల్డర్ హిల్స్ లో జనవరి 25న మ్యూజిక్ మరియు యువ సంస్కృతి యొక్క వైభవోపేతమైన సంబరం. రాయల్ స్టాగ్ Read more

తమిళనాడులో దంచి కొడుతున్న వర్షాలు
rains in tamilanadu

తమిళనాడులో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెల్లూరు, పెరంబూర్, సేలం, నామక్కల్, శివగంగ, ముదురై, దిండిగల్, తూత్తుకుడి, తెనాకాశీ, తేని జిల్లాలకు భారత Read more

రూ. 2 కోట్లు నష్టపోయిన యువకుడు – యూట్యూబర్ ‘లోకల్ బాయ్’ నాని అరెస్ట్
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో మోసాలు – యూట్యూబర్ నాని అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో మోసాలు – యూట్యూబర్ నాని అరెస్ట్ వివరాలు:ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ Read more

చెన్నై – బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
Fatal road accident

చెన్నై: బెంగళూరు హైవేపై శ్రీపెరంబదూర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. Read more