new car

తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైనుంచి దూసుకెళ్లిందో కారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌ కానిస్టేబుల్ రాజి లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్‌పై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కారు డ్రైవర్ రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. డ్రైవర్‌తోపాటు ఇతర నిందితులు పశ్చిమ గోదావరిలో పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. కాగా, నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయింది. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
కాకినాడ పోర్టు అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి పవన్ లేఖ
pawan kalyan visits kakinad

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ Read more

ఉద్యోగులపై పెండింగ్ కేసులు.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ఉద్యోగులపై విజిలెన్స్, శాఖాపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో Read more

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు డైరెక్ట్ ఫ్లైట్
flight

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇక థాయ్‌లాండ్ వెళ్లాలంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిన పనిలేదు. హైదరాబాద్ నగరం నుంచి నేరుగా థాయ్‌లాండ్ చేరుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్ శంషాబాద్ Read more

కోడి పందాలు ప్రారంభించిన రఘురామ

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తన నియోజకవర్గంలో కోడి పందాల్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత సొంత నియోజకవర్గం ఉండిలో ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *