naralokeshWell done

తండ్రి తిన్న ప్లేట్ ను తీసి శభాష్ అనిపించుకున్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు , లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం చంద్రబాబు తిన్న ప్లేట్ ను నారా లోకేశ్ తీసి, శుభ్రత సిబ్బందికి సహాయం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి కనిపించని ఈ వినయం నారా లోకేశ్ వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచింది.

దీనిపై నారా భువనేశ్వరి తన స్పందనను తెలియజేస్తూ, “చంద్రబాబు తిన్న ప్లేట్ ను తీసి, శుభ్రత సిబ్బందికి సాయం చేసిన లోకేశ్ నా గర్వానికి కారణం. ఇది తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవాన్ని మాత్రమే కాకుండా, మనకు సహాయం చేసే వారి పట్ల ఉండే విధేయతను కూడా తెలియజేస్తుంది” అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నారా భువనేశ్వరి ఆ వీడియోను పంచుకోవడంతో, లోకేశ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యులకే కాదు, నేతలకు కూడా ఇలాంటి చర్యలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Posts
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించిన ట్రంప్
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించిన ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)పై ఆంక్షలు విధిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఆయన ఈ నిర్ణయాన్ని అమెరికా Read more

కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
Encounter in Kupwara. Terrorist killed

శ్రీనగర్‌: మరోసారి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు తాజాగా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలం Read more

చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే అనిరుధ్
mla anirudh

తిరుమలలో తెలంగాణ MLAల రికమండేషన్ లెటర్ల చెల్లవనడంపై జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యంలో నెట్టాయి. ఆయన, తమ లెటర్లు చెల్లకపోతే చంద్రబాబు Read more

చైనా వైరస్: భారతదేశంపై ప్రభావం?
చైనా వైరస్: భారతదేశంపై ప్రభావం?

చైనాలో హెచ్ఎమ్పివి (హ్యూమన్ మెటాప్యూమోవైరస్) వ్యాప్తి గురించి వివిధ ఊహాగానాలు వచ్చినప్పటికీ, భారతదేశంలోని ఆరోగ్య సంస్థలు "ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశాయి. డైరెక్టరేట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *