bujjithalli song

‘తండేల్’ నుండి లవ్ సాంగ్ విడుదల

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ‘తండేల్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్ ను ఈనెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాలెంటైన్ వీక్ సందర్భంగా 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. దీంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

Advertisements

ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను గురువారం విడుదల చేసారు. బుజ్జి తల్లి అంటూ సాగే ఈ పాట.. తమ లవర్స్‌ను బుజ్జిగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ లవ్ సాంగ్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోతుండగా.. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీనే హైలెట్‌గా నిలిచింది. దీంతో ‘తండేల్’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుంది. ఈ క్రమంలో కొందరు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాల గురించి ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్​లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్​తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ ‘దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే’ అంటూ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాకు రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్​పై అల్లు అరవింద్, బన్నీ వాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Posts
మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ ఆధిక్యంతో విజయం..
MAHAYUTI 1

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి రాబోతున్నట్లు ప్రస్తుతం అందుతున్న ట్రెండ్‌లు చెబుతున్నాయి. బిజేపీ, శివసేన (ఎక్నాథ్ షిండే వర్గం) Read more

తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు
తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు

సైబర్ మోసగాళ్లు భయం, దురాశ లేదా ఉత్సుకత వంటి లక్ష్యాల మానసిక దుర్బలత్వాలను అర్థం చేసుకుని, వాటిని తమ ప్రయోజనానికి వినియోగిస్తున్నారు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ Read more

మంత్రులకు సీఎం దిశా నిర్దేశం.
మంత్రులకు సీఎం దిశా నిర్దేశం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం జరిగిన తరువాత మంత్రులతో వేరుగా భేటీ అయ్యారు.పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందరూ గేర్ మార్చాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని Read more

కమాండెంట్ గంగారాం మృతిపట్ల కేటీఆర్ సంతాపం
KTR condoles the death of Commandant Gangaram

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, 17వ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ గంగారాం (58) మృతిపట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. Read more

×