WhatsApp Image 2024 12 17 at 11.52.32 AM

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌, నార్త్‌ వెస్ట్ ఢిల్లీలోని సరస్వతి విహార్‌లో గల ఓ పాఠశాలకు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్ సాయంతో పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
బాంబు బెదిరింపులతో బేజారు
ఇటీవల విమానాల్లో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్స్ రావడం లేదా మెయిల్స్ రావడం పరిపాటుగా మారింది. తాజాగా స్కూల్స్ లో కూడా బాంబు బెదిరింపులు రావడంతో అధికారుల తలలు పట్టుకుంటున్నారు. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడంతో అధికారుల అప్రమత్తం అయి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ మెయిల్స్, కాల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పోలీసులకు చెప్పారు.

Advertisements
Related Posts
కేంద్ర మంత్రికి స్టాలిన్ వార్నింగ్
తమిళ విద్యా విధానంపై కేంద్రం vs తమిళనాడు మాటల యుద్ధం

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడు విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలు, Read more

పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా
Narendra Bhondekar

మహరాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపు పొందినప్పటినుంచి సీఎం, మంత్రి పదవుల పై కసరత్తులు జరుగుతున్నా, ఇంకా అక్కడ దీనిపై స్పష్టత రావడం లేదు. తాజాగా మంత్రి పదవిని Read more

IPL 2025: కోల్‌కతాపై గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం
IPL 2025: కోల్‌కతాపై గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతున్నది. ఒక మ్యాచ్‌ గెలుస్తూ, మరో మ్యాచ్‌లో ఓడుతున్న కోల్‌కతా మళ్లీ అదే Read more

కాంగ్రెస్‌లో బీజేపీ ఏజెంట్లు వున్నారు! : రాహుల్ గాంధీ
ఆఫ్ షోర్ మైనింగ్ టెండర్లపై రాహుల్ స్పందన

గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రజల అంచానాలను అందుకోలేకపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో Read more

Advertisements
×