domestic flights

ఢిల్లీలో పెరిగిన పొగమంచుతో ఐదు విమానాలు రద్దు

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు ఆవహించడంతో వాహనదారులు తంటాలుపడుతున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. పొగమంచు వల్ల ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి తోడు పొగమంచు రాజధాని వాసులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 7.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితి.

80కిపైగా విమాన సర్వీసులకు అంతరాయం
సాధారణంగా రన్‌వే విజిబిలిటీ 200 నుంచి 500 మీటర్ల మధ్య ఉంటుంది. అయితే, సాధారణ దృశ్యమానత ఇవాళ ఉదయం సున్నాకు పడిపోయింది. దీంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు 80కిపైగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. ఫ్లైట్‌రాడార్‌24 ప్రకారం.. కనీసం 80 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ ఐదు విమానాలు రద్దయ్యాయి. దీంతో విజిబిలిటీ దాదాపు సున్నాకి పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచుతో పాటు కాలుష్యం కూడా పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు.

Related Posts
ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: వాయు నాణ్యత 49 సిగరెట్ల పొగతో సమానం..
smoking

ఢిల్లీ నగరం సోమవారం ఉదయం తీవ్ర పొగతో కమ్ముకొని పోయింది.. వాయు నాణ్యత సూచిక (AQI) అనేక ప్రాంతాల్లో 1,500ని దాటింది. దీంతో, అధికారులు "గ్రేడెడ్ రెస్పాన్స్ Read more

యమునా నది నీటిని తాగిన హర్యానా సీఎం
Haryana CM Naib Singh Saini drank water from Yamuna river

చండీగఢ్‌: దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కాలుష్యంపై వివాదం కొనసాగుతున్నది. ఈ జలాల్లో అమోనియా ఎక్కువగా ఉందని, నీరు విషపూరితం కావడానికి హర్యానా కారణమని ఆప్‌ Read more

జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని నాపై ఒత్తిడి చేశారు: విజయసాయి రెడ్డి
vijayasai reddy

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి కీలక Read more

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కేంద్రం హెచ్చరిక
ott

ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. ఇటీవల సినిమాలు, వెబ్‌ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్‌ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు Read more