CM Revanth Reddy will go to Maharashtra today

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ ముందు నుండి కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి , డ్రగ్స్ , ఇతర మాదక ద్రవ్యాలపై కూడా ఫోకస్ చేసారు. ఎక్కడిక్కడే నిఘా ఏర్పాటు చేసి , పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చి డ్రగ్స్ అనేది కనపడకుండా చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ప్రతి రోజు పెద్ద ఎత్తున గంజాయి ని పట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisements

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడానికి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా జిల్లాల్లోని అన్ని యూనిట్స్ లో ఈ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ పీఎస్ ల తరహాలోనే డ్రగ్స్ సహా ఇతర మాదకద్రవ్యాల కేసులను దర్యాప్తు చేయనున్నాయి. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ పర్యవేక్షణలో ఇందులో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక డీఎస్పీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్ ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

ప్రతి పీఎస్ కు డీఎస్పీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. నార్కొటిక్స్ పీఎస్ లో ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదు కాబడిన కేసులను కూడా వీరు దర్యాప్తు చేస్తారు. అలాగే స్థానికంగా లా అండ్ ఆర్డర్ పీఎస్ లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించనున్నారు. గంజాయి, డ్రగ్స్ కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు సిబ్బందిని నార్కొటిక్స్ పీఎస్‌లో నియమించున్నారు.

గతంలో గంజాయి, డ్రగ్స్ సప్లై చేసిన ముఠాలను విచారిస్తూ అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల డబ్బు సంపాదించే క్రమంలో గంజాయి, డ్రగ్స్ దందా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. కానీ, ఎవరో ఒకరు ఈ వ్యవహారాలు లీక్ చేయడంతో పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు.

Related Posts
South Korea: దక్షిణ కొరియాలో పదవీచ్యుతుడైన అధ్యక్షుడి స్థానంలో ఎన్నికలు
దక్షిణ కొరియాలో పదవీచ్యుతుడైన అధ్యక్షుడి స్థానంలో ఎన్నికలు

అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పదవీచ్యుతి: రాజ్యాంగ న్యాయస్థానం నిర్ధారింపుదక్షిణ కొరియాలో ఇటీవల పదవీచ్యుతుడైన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ స్థానంలో, 2025 జూన్ 3న స్నాప్ Read more

నెల్లూరు జిల్లా ముత్తుకూరు తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
ACB officials raided the office of Muthukur Tahsildar of Nellore district

లంచం తీసుకుంటున్న తాసిల్దార్ బాలకృష్ణ అరెస్ట్.. ముత్తుకురు : ముత్తుకూరు మండలానికి చెందిన వెంకటరమణయ్య అనే రైతు తన తల్లి కాంతమ్మకు సంబంధించిన పొలానికి అడంగల్ లో Read more

సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు
Sankranti holidays announced by Inter Board

హైరదాబాద్‌: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈమేరకు జనవరి 7న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈసారి మొత్తంగా ఇంటర్ కాలేజీలకు Read more

తొలిసారి భారత్ లో పర్యటించబోతున్న US ఇంటెలిజెన్స్ చీఫ్
US intelligence chief

అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ తొలిసారి భారతదేశాన్ని సందర్శించనున్నారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఆమె తొలి గమ్యస్థలం జపాన్. అక్కడ కీలక చర్చలు ముగించుకున్న Read more

Advertisements
×