ponguleti runamafi

డిసెంబర్ లోపు మిగిలిన వారికి రుణమాఫీ చేస్తాం – మంత్రి పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఇల్లెందు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ.. డిసెంబర్ నెలలోపు మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు అనేక ఉచిత హామీలు ఇవ్వడం తో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను భారీ మెజార్టీ తో గెలిపించారు.

ఇక అధికారంలోకి రాగానే చెప్పినట్లే హామీలు నెరవేర్చడం మొదలుపెట్టింది. పలు కీలక హామీలు నెరవేర్చిన సర్కార్..మిగిలిన హామీలను కూడా త్వరలోనే నెరవేర్చాలని చూస్తుంది. అయితే రైతు రుణమాఫీ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో హామీ నెరవేర్చలేకపోయింది. పలు కారణాల కారణంగా కొంతమందికి మాత్రం రుణ మాఫీ చేయగా..మరికొంతమందికి మాఫీ చేయలేకపోయింది. దీంతో మాఫీ కానీ రైతులు సర్కార్ పై ఆందోళనకు దిగారు. త్వరగా మాకు కూడా రుణమాఫీ చేయాలనీ కోరుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి డిసెంబర్ లోపు మిగిలినవారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

Related Posts
వికసిత్ భారత్: మోదీతో యువత సంభాషణ
వికసిత్ భారత్ మోదీతో యువత సంభాషణ

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా నేతృత్వంలో భారత మండపంలో 'వికసిత్ భారత్ యువ లీడర్స్ డైలాగ్' కార్యక్రమం నిర్వహించబడుతోంది. మూడు Read more

Telangana Budget 2025-26 : బడ్జెట్ లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు – హరీశ్ రావు
327492 harish rao

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమం కన్నా అబద్ధాలు, అతిశయోక్తులే ఎక్కువగా ఉన్నాయని ఆయన Read more

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు
MLAs beaten in Jammu and Kashmir Assembly

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణపై ఈరోజు ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. నేడు కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. ఇంజినీర్‌ రషీద్‌ సోదరుడు, నేషనల్ కాన్ఫరెన్స్ Read more

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు: కేటీఆర్‌
krt

ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు అని కేటీఆర్‌ అన్నారు.భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ Read more