eo and chariman

టీటీడీ ఛైర్మన్ తో విభేదాలు ?

తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ)ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ఓవైపు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మరోవైపు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట టీటీడీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు టీటీడీ ఎక్కడా చెప్పకపోవడం, ఛైర్మన్, ఈవో మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరగడం చర్చనీయాంశమైంది.


తిరుపతి తొక్కిసలాట తర్వాత అక్కడ పర్యటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఛైర్మన్, ఈవో సమన్వయంతో పనిచేయాలని తేల్చిచెప్పేశారు. రివ్యూ మీటింగ్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఈ ఘటనపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడితో శ్యామలరావుకు గ్యాప్ ఉందన్న చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. టీటీడీలో ఎలాంటి సమన్వయ లోపం లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

అలాగే టీటీడీలో ఛైర్మనే కీలకమని, బోర్డు నిర్ణయాల్ని అదికారులు అమలు చేస్తారని కూడా వెల్లడించారు. మరోవైపు తిరుపతి వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం భక్తుల్ని అనుమతించే విషయంలో కొన్ని లోపాలు జరిగాయని శ్యామలరావు అంగీకరించారు. అయితే ఛైర్మన్ కూ, తనకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తాను ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడనని ఈవో స్పష్టం చేశారు. తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Posts
అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ – పేర్ని నాని
nani babu

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైసీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని 'అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ.. గుర్తుంచుకో' అని పేర్ని నాని సవాల్ విసిరారు. శ‌నివారం Read more

ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం: సీఎం చంద్రబాబు
New law in AP soon: CM Chandrababu

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. అయితే మంత్రి నారా లోకేష్, Read more

సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు
Mangalagiri Police Notices to YCP Leaders Sajjala Ramakrishna Reddy

అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల మెడ చుట్టూ బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన పోలీసులు తాజాగా Read more

కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు భేటీ
CM Chandrababu meets Union Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తొ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *