thmmala brs

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన మంత్రి తుమ్మల

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టిన బీఆర్ నాయుడును..తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కలిశారు. హైదరాబాద్‌లోని బీఆర్ నాయుడు నివాసంలో మర్యాదపూర్వంగా కలవడం జరిగింది. శ్రీవారి భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్ చేశారు.

Advertisements

తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించాలని.. అలా అనుమతించకుంటే ఎంతవరకైనా వెళతామని ఆ మధ్య కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ నుంచి వచ్చే కృష్ణానది జలాలను వాడుకుంటున్న మీరు.. వెంకన్న స్వామి దర్శనానికి మా ఎమ్మెల్యేల లేఖలను ఎందుకు అనుమతించరో చెప్పాలని డిమాండ్ చేసారు. అందుకే మంత్రి తుమ్మల ..బీఆర్ నాయుడు వద్ద ఆ ప్రస్తావన తీసుకొచ్చారు.

ఇక తాను ఎంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి కీలక పదవిని తాను చేపట్టిన విషయం ఊహకు అందడంలేదని బీఆర్ నాయుడు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు, నారా లోకేశ్ కు, పవన్ కల్యాణ్ కు, మిగిలిన ఎన్డీయే పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

టీటీడీ చైర్మన్ పదవిపై తాను ఆశపడిన మాట వాస్తవమేనని అన్నారు. జీవితంలో ఒక్కసారైనా టీటీడీ చైర్మన్ అవ్వాలి, దేవుడికి సేవ చేయాలని కోరుకున్నానని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటినుంచి తనలో ఈ కోరిక ఉందని, అప్పట్లో ప్రయత్నం కూడా చేశానని, కానీ ఫలించలేదని బీఆర్ నాయుడు వివరించారు. చంద్రబాబును ఒకటిన్నర ఏడాది కింద స్వయంగా అడిగానని వెల్లడించారు.

Related Posts
‘నమశ్శివాయ’ అంటే ఏంటో తెలుసా?
Lord Shiva at Murudeshwar

హిందూ ధర్మంలో పవిత్రమైన మంత్రాల్లో 'ఓం నమశ్శివాయ' కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం గా పిలుస్తారు, ఎందుకంటే దీనిలో 'న, మ, Read more

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ – నిధులు, ప్రాజెక్టులపై చర్చ
CM Revanth condemns attacks on houses of film personalities (1)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హస్తినకు Read more

వయనాడ్‌లో దూసుకుపోతున్న ప్రియాంక..లక్ష దాటిన ఆధిక్యం
Priyanka is rushing in Wayanad.Lead of more than one lakh

వయనాడ్‌: వయనాడ్ లోకసభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ ఉపఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. Read more

Minister Uttam Kumar : కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు : మంత్రి ఉత్తమ్ కుమార్
Minister uttam kumar reddy comments on brs

Minister Uttam Kumar: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలి. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నాం Read more

Advertisements
×