ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను స్టార్ క్యాంపెయినర్‌గా ఏఐసీసీ నియమించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేసిన జాబితాలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
భట్టి విక్రమార్క ఇప్పటికే ఝార్ఖండ్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్థానిక నాయకులతో సమావేశమవుతున్నారు. రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బోకారోలో ఓ చాయ్ దుకాణంలో టీ తాగుతూ స్థానికులతో ముచ్చటించిన వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు, ప్రజల సమస్యలను సానుకూలంగా వినడంపై దృష్టి సారించారు.