pawankalyan3

జోరు వానలో సాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన

విజయనగరం :
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. జోరు వానలోనూ పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది.
గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కాలి నడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించి అధికారులకు ఆదేశాలిచ్చారు. మక్కువ మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా మొబైల్ లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, సిద్దవటంతోపాటు ఇక్కడ అడ్వంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని.. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియచేయాలని అధికారులకి సూచించారు.
శంబర గ్రామంలో శ్రీ పోలమాంబ ఆలయం వద్ద పనికి ఆహార పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు. రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్ లో వీడియో తీసుకున్నారు.

Related Posts
గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు డీమ్డ్ యూనివర్శిటీ అప్లికేషన్స్
Deemed University inviting applications for undergraduate programmes

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ యూనివర్శిటీగా పేరుతెచ్చుకున్న సింబయాసిస్ ఇంటర్నేషనల్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తోంది. సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ Read more

Day In Pics: డిసెంబ‌రు 12, 2024
today pics 12 12 24 copy

జార్ఖండ్‌లోని రాంచీలో గురువారం అసెంబ్లీ సమావేశాల‌లో పాల్గొన్న జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, బీజేపీ ఎమ్మెల్యే చంపాయ్ సోరెన్ అగర్తలాలోని మార్కెట్‌లో గురువారం ఉద‌యం చ‌లినుండి Read more

కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ “షాప్ అండ్ విన్ కార్” ఆఫర్
Kisna Diamond & Gold Jewelery brings joy with its Shop and Win Car offer

గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ , సత్తెనపల్లిలోని Read more

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం: మార్కెట్లకు పెద్ద షాక్
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం: మార్కెట్లకు పెద్ద షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో వెనుకడుగు వేయరని మరోసారి నిరూపించారు. ఆయన తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికా-కెనడా మధ్య వాణిజ్య Read more