oil tanker

జైపూర్‌ ట్యాంకర్ పేలుడులో 14కు పెరిగిన మృతుల సంఖ్య

జైపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్‌ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం ఉదయానికి మృతుల సంఖ్య 14కి చేరినట్లు డీసీపీ అమిత్‌ కుమార్‌ తెలిపారు.
శుక్రవారం ఉదయం జైపూర్‌-అజ్మీర్‌ రహదారిలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్‌ ట్రక్కును ఢీ కొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 37 వాహనాలు మంటల్లో కాలిపోయాయి.

jaipur

30 మంది పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో 80 మందికిపైగా గాయపడ్డారు. అందులో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నమన్నారు. మరోవైపు చనిపోయినవారి కుటుంబాలకు రాజస్థాన్‌ సర్కారు రూ.5 లక్షలు, ప్రధాని తన జాతీయ సహాయ నిధి తరపున రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాయి. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష, ప్రధాని సహాయ నిధి రూ.50 వేలు పరిహారంగా ఇస్తామని తెలిపాయి. ఈ ప్రమాదం చాల బాధాకరమని మోడీ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.

Related Posts
నేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy will start Indiramma Houses today

మొదటి విడతలో 72,045 ఇళ్లకు శంకుస్థాపన హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈరోజు మరో అడుగు పడనుంది. జనవరి 26న తొలి విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా Read more

హీరో కిచ్చా సుదీప్ కు మాతృవియోగం
kiccha sudeep lost his moth

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది, ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. వయసుతో సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని Read more

AP Cabinet : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
Cabinet approves AP Annual Budget

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రులు సమావేశమై రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన విధానాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ Read more

భారత్‌పై నోరుపారేసుకున్న ట్రంప్
41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత అక్రమ వలసదారులు, రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, Read more