lorry cleaner was burnt ali

జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం

జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీ ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలు మంటలు చెలరేగాయి. వ్యాను ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. హైవేపై భోగాపురం సమీపంలో నారు పేట పెట్రోల్ బంకు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యాన్ వెళ్తోంది. నారు పేట వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ఇసుక లారీ ని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఢీకొట్టిన సమయంలో వ్యాన్లో చిక్కుకున్న క్లీనర్ బయటికి రాలేకపోవడంతో సజీవ దహనం అయ్యాడు. సిఐ ప్రభాకర్, ఎస్సై లు పాపారావు, సూర్య కుమారి, హైవే సిబ్బంది చేరుకొని జాతీయ రహదారిపై వెళ్తున్న మిగతా వాహనాలకు మనుషులు తగలకుండా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వ్యాన్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.

Related Posts
నేడు శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక
Today the President will come to Hyderabad for winter vacation

హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ రాష్ట్రపతి ముర్ము Read more

ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుంది: ప్రధాని
Prime Minister Modi speech in the Parliament premises

న్యూఢిల్లీ : ఈరోజు నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో Read more

గ్లోబల్ ఆర్థిక సంక్షోభంలో రూపీ ₹84.40 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరింది
rupee

ఇటీవల భారత్‌లో రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే గణనీయంగా పడిపోయింది. రూపాయి 84.40 అనే ఆల్-టైమ్ లోవ్ స్థాయికి చేరుకోవడం షాక్ ఇచ్చింది. ఫారెక్స్ వ్యాపారులు Read more

యుద్ధ నౌకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
modi mh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా, రెండు అత్యాధునిక యుద్ధనౌకలు INS Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *