nimmala

జగన్ విద్యుత్ రంగాన్ని నాశనం చేసారు : నిమ్మల

జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
పాలకొల్లు నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో రూ .3 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు. జన్ కో నుంచి ఐదు రూపాయలకే యూనిట్ కరెంటు లభించే అవకాశం ఉండగా కమిషన్ల కోసం రూ. ఎనిమిది నుంచి 14 రూపాయలకు జగన్ కొనుగోలు చేశారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన జగన్ ఇంటి ముందే వైసీపీ శ్రేణులు ధర్నాలు చేయాలన్నారు. గత చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Related Posts
వైసీపీలోకి శైలజానాథ్
Sailajanath

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన Read more

మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్రగడ
mudragada

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచినా Read more

పోలవరంపై బడ్జెట్ కు ముందే రాష్ట్రపతి ప్రకటన!
droupadi murmu

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె వివరించారు. Read more

 శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
cr 20241012tn670a399a39849

శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న దారుణం అందరినీ తీవ్ర మానసిక కల్లోలం చెందేలా చేసింది. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లి సమీపంలో ఈ సంఘటన జరిగింది, అక్కడ అత్తాకోడళ్లపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *