bhaskar reddy

చెవిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన ఓ కేసులో హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆంధ్రారాజకీయాలలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనపై టీడీపీ కక్ష రాజకీయాలు చేస్తున్నదని, తనకు సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారని, కావున ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. చెవిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు తదుపరి విచాణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మరోవైపు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Related Posts
ఏపీ సర్కార్ కు కేంద్రం సూచనా..
polavaram

పోలవరం మెయిన్ డ్యాం పనులకు కేంద్రం రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా చెల్లించడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీలు మేఘా, బావర్లను Read more

ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఊహించని తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. బస్సు ఢీ కొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు Read more

రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ ఆరోపణలు – అంబటి

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూ తయారీలో కల్తీ Read more

ఇడుపులపాయలో వైఎస్సార్ కు జగన్ ఘన నివాళి
Jagan pays tribute to YSR at Idupulapaya

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరులోని కార్యక్రమం ముగించుకొని కడప జిల్లా ఇడుపులపాయకు వచ్చారు. ఇడుపులపాయ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *