chandrababu

చిత్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నది.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6 నుంచి 8 వరకు చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే డ్వాక్రా సంఘాలతో సమావేశంకానున్నారు. పలు ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం. ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవీడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రకృతి వ్యవసాయం విజన్‌లను ప్రారంభిస్తారు.


స్వర్ణకుప్పం విజన్ 2029 పై చర్చ
అనంతరం స్వర్ణకుప్పం విజన్ 2029 పై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అగారాం కొత్తపల్లి గ్రామానికి వెళ్లి డ్వాక్రా సంఘాలతో సీఎం మాటామంతి నిర్వహించనున్నారు. 2:30 గంటలకు నడిమూరు గ్రామంలో సౌర విద్యుతీకరణ కార్యక్రమం ప్రారంభం అనంతరం స్థానిక యువతతో ఇష్టాగోష్టిలో పాల్గొటారు. అనంతరం సిగాల పల్లెకు చంద్రబాబు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు ద్రవీడియన్ యూనివర్సటీ ఆడిటోరియంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. రాత్రి 7:30 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు.

Related Posts
ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్‌కు కేంద్ర అనుమతి తీసుకున్న నారా లోకేష్
ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కు కేంద్ర అనుమతి తీసుకున్న నారా లోకేష్1

ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పరిజ్ఞానం మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని Read more

తీరని వెత…. డోలిమోత
vizag1

-- ప్రభుత్వాలు మారినా మారని ఆడబిడ్డల తలరాతవిశాఖపట్నం : ఈ కథ కొత్తది కాదు.. నిర్లక్ష్యపు గర్భంలో పూడుకుపోయిన పాత కథ.. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, Read more

పవనే ఇక రాష్ట్రానికి దిక్కు: ఉండవల్లి కామెంట్
పవనే ఇక రాష్ట్రానికి దిక్కు: ఉండవల్లి కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిమానం చాటుకున్నారు. గతంలో ఓసారి పవన్ కళ్యాణ్ పిలిస్తే Read more

ఫ్రీ బస్‌పై చిత్తశుద్ధి లేదు : వైఎస్‌ షర్మిల
sharmila

మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. టీడీపీ , జనసేన పార్టీలకు కాలయాపన తప్పా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *