ktr comments on cm revanth reddy

చిట్టినాయుడు..నువ్వా కేసీఆర్‌ పేరును తుడిచేది..రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ కౌంటర్‌

హైదరాబాద్‌: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు కనిపించకుండా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల పై కేటీఆర్‌ స్పందించారు. చిట్టినాయుడు.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? అంటూ కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. చిట్టినాయుడు.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని చెప్పారు. నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడని పేర్కొన్నారు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడని గుర్తు చేశారు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడన్నారు. సాధించుకున్న తెలంగాణను నువ్వు సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోసాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

Related Posts
సింగపూర్ రివర్ పై సీఎం రేవంత్ బోటు ప్రయాణం
cm revanth sgp

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ రివర్ పై బోటు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతుల గురించి Read more

రేవంత్ విధానాల వ‌ల్ల ప్ర‌జ‌లు విసిగిపోతున్నారు: తీన్మార్ మ‌ల్ల‌న్న
People are getting tired of Revanth policies.. Teenmar Mallanna

హైద‌రాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై పై నిప్పులు చెరిగారు.రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి కుర్చీకి పునాది వేసింది తానే అని Read more

ఈ రోజు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల
Tet notification released today in Telangana

హైదరాబాద్‌ : తెలంగాణలో ఈరోజు టెట్‌ పరీక్షకు సంబంధించిన మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే సంవత్సరానికి టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రెండుసార్లు నిర్వహిస్తామన్న తెలంగాణ Read more

ప్రపంచ పిల్లల దినోత్సవం – 20 నవంబర్
World Childrens Day

ప్రపంచ పిల్లల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 20న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1954లో ప్రపంచంలో ప్రతి దేశంలో పిల్లల హక్కులు, వారి సంక్షేమం మరియు మంచి Read more