director puri jagannadh 2

చాలామంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చేసాడు.పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో ఎంతో ప్రత్యేకమైన దర్శకుడిగా పేరుగాంచారు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలను స్టార్ స్టేటస్ కి చేర్చడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం పూరి దర్శకత్వం వహించిన సినిమాలు హీరోల జీవితాలలో కొత్త పేజీ తెరిచాయి. నటీనటుల ఫీల్ కూడా పూర్తిగా మార్చేశారు. అనేక సందర్భాల్లో వారు మాట్లాడుతూ, తమ ఇమేజ్ లో వచ్చిన మార్పుకు పూరి జగన్నాథ్ నే కారణమని గొప్పగా చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూలో “బుజ్జిగాడు” సినిమా కోసం 6 నెలలు వెయిట్ చేశానని చెప్పాడు. అది తనకెంతగానో నచ్చిందని, ఆ సినిమా విడుదల కావాలని ఎంతగానో ఆశపడ్డానని, ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకున్నానని చెప్పాడు.

“బుజ్జిగాడు” సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను పూరి జగన్నాథ్ ఎంతో స్టైలిష్ గా, కొత్తగా చూపించారు. అందులోని “చేతి మీద ఇలా కొడితే ఒక నరం వస్తది, ఈ నరాన్ని ఇలా పట్టుకొని గట్టిగా లాగితే 100 మీటర్ల తాడు వస్తది” అనే డైలాగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాతో ప్రభాస్ పూర్తి స్థాయిలో ఒక విభిన్న నటుడిగా మారిపోయాడని, “బుజ్జిగాడు” ముందు, తర్వాత ప్రభాస్ ఇమేజ్ లో తేడా కనపడిందని దర్శకుడు రాజమౌళి కూడా పేర్కొన్నాడు ఇక పవన్ కళ్యాణ్ ను “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమాలో మాస్ అవతారంలో చూపించి, ఆయన ఇమేజ్ కి మళ్లీ కొత్త శక్తి అందించారు. ఆ సినిమాలో పవన్ చెప్పిన డైలాగులు అభిమానులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి. ప్రత్యేకంగా రవితేజ గురించి చెప్పుకోవాలి, పూరి తన సినిమాలతో రవితేజ కెరీర్ లో ముఖ్యమైన మలుపు తిప్పాడు. “నేనింతే” సినిమాలో రవితేజతో “ఒక్క రూపాయి కూడా సంపాదించలేని ఏ వెధవికి ఐ లవ్ యు చెప్పే అర్హత లేదు” అని చెప్పించి ప్రేక్షకుల మనసులు గెలిచాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన “టెంపర్” సినిమా ఆయన మాస్ ఇమేజ్ ని మరింత పెంచింది. తారక్ చెప్పిన “నీకు ఈగో లోపల ఉంటుందేమో, నాకు వైఫై లాగా చుట్టూ ఉంటుంది” అనే డైలాగ్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అదే విధంగా మహేష్ బాబును “పోకిరి” సినిమాలో యూత్ లో హీరోగా, మాస్ ఆడియన్స్ కు మరింత చేరువ చేశారు పూరి జగన్నాథ్ సినిమా చేయగానే హీరోల ఇమేజ్ కొత్త మలుపు తీసుకుంటుందని, స్టార్ స్టేటస్ కు వెళ్తారని అనిపించేలా ఆయన ప్రతిభ. రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గురించి ప్రస్తావిస్తూ, హీరోల కెరీర్ లో కీలక మార్పులు తెచ్చిన వ్యక్తిగా కొనియాడాడు.పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో ఎంతో ప్రత్యేకమైన దర్శకుడిగా పేరుగాంచారు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలను స్టార్ స్టేటస్ కి చేర్చడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం పూరి దర్శకత్వం వహించిన సినిమాలు హీరోల జీవితాలలో కొత్త పేజీ తెరిచాయి. నటీనటుల ఫీల్ కూడా పూర్తిగా మార్చేశారు. అనేక సందర్భాల్లో వారు మాట్లాడుతూ, తమ ఇమేజ్ లో వచ్చిన మార్పుకు పూరి జగన్నాథ్ నే కారణమని గొప్పగా చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూలో “బుజ్జిగాడు” సినిమా కోసం 6 నెలలు వెయిట్ చేశానని చెప్పాడు. అది తనకెంతగానో నచ్చిందని, ఆ సినిమా విడుదల కావాలని ఎంతగానో ఆశపడ్డానని, ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకున్నానని చెప్పాడు.

“బుజ్జిగాడు” సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను పూరి జగన్నాథ్ ఎంతో స్టైలిష్ గా, కొత్తగా చూపించారు. అందులోని “చేతి మీద ఇలా కొడితే ఒక నరం వస్తది, ఈ నరాన్ని ఇలా పట్టుకొని గట్టిగా లాగితే 100 మీటర్ల తాడు వస్తది” అనే డైలాగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాతో ప్రభాస్ పూర్తి స్థాయిలో ఒక విభిన్న నటుడిగా మారిపోయాడని, “బుజ్జిగాడు” ముందు, తర్వాత ప్రభాస్ ఇమేజ్ లో తేడా కనపడిందని దర్శకుడు రాజమౌళి కూడా పేర్కొన్నాడు ఇక పవన్ కళ్యాణ్ ను “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమాలో మాస్ అవతారంలో చూపించి, ఆయన ఇమేజ్ కి మళ్లీ కొత్త శక్తి అందించారు. ఆ సినిమాలో పవన్ చెప్పిన డైలాగులు అభిమానులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి. ప్రత్యేకంగా రవితేజ గురించి చెప్పుకోవాలి, పూరి తన సినిమాలతో రవితేజ కెరీర్ లో ముఖ్యమైన మలుపు తిప్పాడు. “నేనింతే” సినిమాలో రవితేజతో “ఒక్క రూపాయి కూడా సంపాదించలేని ఏ వెధవికి ఐ లవ్ యు చెప్పే అర్హత లేదు” అని చెప్పించి ప్రేక్షకుల మనసులు గెలిచాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన “టెంపర్” సినిమా ఆయన మాస్ ఇమేజ్ ని మరింత పెంచింది. తారక్ చెప్పిన “నీకు ఈగో లోపల ఉంటుందేమో, నాకు వైఫై లాగా చుట్టూ ఉంటుంది” అనే డైలాగ్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అదే విధంగా మహేష్ బాబును “పోకిరి” సినిమాలో యూత్ లో హీరోగా, మాస్ ఆడియన్స్ కు మరింత చేరువ చేశారు పూరి జగన్నాథ్ సినిమా చేయగానే హీరోల ఇమేజ్ కొత్త మలుపు తీసుకుంటుందని, స్టార్ స్టేటస్ కు వెళ్తారని అనిపించేలా ఆయన ప్రతిభ. రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గురించి ప్రస్తావిస్తూ, హీరోల కెరీర్ లో కీలక మార్పులు తెచ్చిన వ్యక్తిగా కొనియాడాడు.

Related Posts
సంక్రాంతికి సీనియర్స్ హవా..
సంక్రాంతికి సీనియర్స్ హవా..

ఈ సంక్రాంతి తెలుగు సినిమా అభిమానులకు పండగే పండగగా మారింది. గేమ్ ఛేంజర్. డాకు మహారాజ్ వచ్చాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.పాన్ ఇండియా మూవీ గేమ్ Read more

 ప్రభాస్‌తో వరుసగా మూడు సినిమాలు చేయనున్న ప్రాజెక్టు
Salaar 2 movie update 1 scaled 1

ప్రభాస్ అభిమానులకు ఒక పెద్ద శుభవార్త హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన ప్రకారం, రెబల్ స్టార్ ప్రభాస్‌తో వారు వరుసగా మూడు సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అద్భుతమైన Read more

కంగువ మూవీకి ఎన్ని కోట్లంటే?
kanguva release

తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన "కంగువ" మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మంచి స్పందనను పొందుతోంది. బాలీవుడ్ నుంచి బాబీ డియోల్, దిశా పటానీ ప్రధాన Read more

Salman Khan: భారీ భద్రత నడుమ బాబా సిద్ధిఖీ నివాసానికి వచ్చిన సల్మాన్ ఖాన్
Salman Khan Baba Siddique 1728822044300 1728822058167

NCP నేత బాబా సిద్ధిఖీ ముంబయిలో హత్యకు గురికావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన ఘటన. గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపగా, సిద్ధిఖీ అక్కడిక్కడే మరణించారు. బాలీవుడ్ సూపర్ Read more