చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

అమరావతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల సమావేశం కీలకంగా మారింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ గంటన్నర పాటు సాగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, ఇతర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అమిత్ షాతో సుదీర్ఘ చర్చ జరిగింది.విజయవాడలో జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షాకు, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు లోకేశ్, అనిత, పురంధేశ్వరి ఘన స్వాగతం పలికారు.

Advertisements
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన అమిత్ షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్మానం చేశారు.చంద్రబాబు నివాసంలో అమిత్ షాతో జరిగిన డిన్నర్ మీటింగ్ ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం సాయం, విభజన హామీల అమలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి పెట్టింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కేంద్రంపై కృతజ్ఞతలు తెలుపుతూ, పెండింగ్ ప్రాజెక్టులపై అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.సమావేశంలో ఎన్డీఏ నేతల మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఎన్టీఆర్‌కు భారతరత్నను ప్రస్తావించగా, చంద్రబాబు కూడా అమిత్ షాతో ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు.విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం 11,140 కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించిన విషయం ప్రత్యేక చర్చకు కారణమైంది. ఈ నిర్ణయంతో తెలుగు ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించామని అమిత్ షా వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా ఆర్థిక ప్యాకేజ్‌పై ట్వీట్ చేస్తూ ఏపీ అభివృద్ధిపై కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు ఈరోజు గన్నవరంలో జరిగే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ క్యాంప్ ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం జరగనుంది.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
MLC election campaign

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికలకన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం పూర్తిగా Read more

YS Sharmila : వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన షర్మిల
YS Sharmila వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన షర్మిల

ఇప్పుడు వైసీపీకి ఇంకా పచ్చకామెర్ల జ్వరం తగ్గినట్టు కనిపించడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నేతలు నిజాన్ని చెప్పినా Read more

ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: వాయు నాణ్యత 49 సిగరెట్ల పొగతో సమానం..
smoking

ఢిల్లీ నగరం సోమవారం ఉదయం తీవ్ర పొగతో కమ్ముకొని పోయింది.. వాయు నాణ్యత సూచిక (AQI) అనేక ప్రాంతాల్లో 1,500ని దాటింది. దీంతో, అధికారులు "గ్రేడెడ్ రెస్పాన్స్ Read more

అరెస్ట్ వారెంట్ పై సోనూ సూద్ క్లారిటీ
Sonu Sood Clarity on Arrest Warrant

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ హీరో సోనూ సూద్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలో Read more

Advertisements
×