varma rajamandri

చంద్రబాబు జైలులో ఉన్నాడని .. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా – వర్మ

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన సినిమాలతోనే కాకుండా మీడియా, సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఇందులో రాజకీయ నాయకులపై చేసే కామెంట్లు, పోస్టులతో పార్టీల కార్యకర్తలతో ప్రశంసలు, విమర్శలు పొందుతూనే ఉంటారు. ఇక టీడీపీ విషయంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లపై ట్వీట్లు, కామెంట్లతో తనదైన శైలిలో ఆర్జీవీ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. గత ఏడాది చంద్రబాబు ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిప్పుడు జైలు బయట నిలుచుని వర్మ సెల్ఫీ తీసుకున్న పిక్ అప్పడు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. “చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలిసింది. నేను ఒక టూరిస్టుగా వెళ్లి, జైలు ఎదుట ఫొటో తీసుకున్నాను. ఇది అలసట, హేళన కాదు. జైలుకు వెళ్లినప్పుడు గాంధీ, హిట్లర్ లేదా జగన్ ఉన్నా, నేను అదే విధంగా వ్యవహరించేవాడిని” అని పేర్కొన్నారు. ఇందులో ఇలాంటి వివాదం, హేళన లేదని . మామూలుగానే తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్మ ఫై ఏపీలో వరుసగా కేసులునమోదైన సంగతి తెలిసిందే. జగన్ అండ చూసుకొని గతం లో చంద్రబాబు , నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ ఫై చేసిన వాక్యాలు, పెట్టిన పోస్టుల ఫై వరుసగా కేసులు పెట్టడం తో..పోలీసులు వర్మ కోసం గాలింపు చేస్తున్నారు. అయన మాత్రం షూటింగ్ ల పేరుతో పోలిసుల విచారణ కు హాజరుకాకుండా తిరుగుతున్నాడు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఎప్పటిలాగానే యాక్టివ్ గా ఉన్నాడు.

Related Posts
ఆలయ హుండీలో 2000 నోట్లు చలామణి
వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.2 వేల నోట్ల ప్రత్యక్షం

దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణి 2023లో రద్దైన విషయం అందరికీ తెలుసు. అయితే, ఆ నోట్లు ఇప్పుడు బయటపడటమే కాదు, ఓ ఆలయ హుండీలో కనిపించడం Read more

టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
Caste census should be conducted in AP too.. YS Sharmila

అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వం మీద మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, Read more

ఎసిబి విచారణపై కెటిఆర్ కౌంటర్
ఎసిబి విచారణపై కెటిఆర్ కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గురువారం మాట్లాడుతూ, అవినీతి నిరోధక బ్యూరో ఏడు గంటల పాటు తనను ప్రశ్నించినప్పుడు, అదే ప్రశ్నలను చాలాసార్లు పునరావృతం చేయడంతో Read more

సీజన్‌ మారుతున్న వేళ కాలిఫోర్నియా ఆల్మండ్స్‌తో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోండి..
As the season changes boost your immune system with California Almonds

న్యూఢిల్లీ: కాలానుగుణ మార్పులతో, రోగనిరోధక శక్తి తరచుగా బలహీనపడుతుంది, దానిని బలోపేతం చేయడానికి సహజ మార్గాలను అనుసరించడం చాలా అవసరం. రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా మెరుగుపరుచుకోవటానికి పోషకాహార Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *