srikakulam accident

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం

కంచిలి మండలం పెద్ద కొజ్జియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా… మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి జాజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

మృతుల వివరాలు: కదిరిశెట్టి సోమేశ్వరరావు(48) ఎం లావణ్య(43), స్నేహగుప్తా(18) దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నం సీతమ్మధార నుండి ఒరిస్సాలోని జాజిపూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Related Posts
శైలజానాథ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్..
Jagan invited Shailajanath wearing a party scarf

అమరావతి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి Read more

అమిత్ షాతో ముగిసిన పవన్ సమావేశం..
pawan amithsha

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల మధ్య సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ భేటీ దాదాపు 15 నిమిషాల పాటు Read more

వాలంటీర్లకు మరో షాక్ – మొబైల్ యాప్‌లో హాజరు ఆప్షన్ తొలగింపు
Another shock for the volun

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లకు వరుస షాకులు తగ్గడం లేదు. వాలంటీర్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. వైసీపీ ప్రభుత్వ Read more

ఏపీఎస్ఆర్టీసీ శివరాత్రి ఆఫర్
Mahashivaratri 2025

మహాకుంభమేళా వేడుకల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ భక్తులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రాజమండ్రి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18న ప్రత్యేక బస్సు ప్రారంభం కానుంది. ఈ బస్సు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *