exame33

గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌పై అనుమానాలు వద్దు

గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు మెరిట్ ప్ర‌కార‌మే అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్‌సీ ఛైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం అన్నారు. రేపు, ఎల్లుండి జ‌ర‌గ‌నున్న గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు టీజీపీఎస్‌సీ ఛైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం అన్నారు. నాంప‌ల్లిలోని టీజీపీఎస్‌సీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌రీక్ష‌లు పూర్తిగా సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతాయ‌ని, అభ్య‌ర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహ‌లు పెట్టుకోకుండా ఎగ్జామ్స్ రాయాలని తెలిపారు.
ఇక ప్ర‌శ్న ప‌త్రాల‌కు సంబంధించి 58 చోట్ల స్టోరేజ్ పాయింట్లు పెట్టామ‌న్నారు. అభ్యర్థికి త‌ప్ప ప్ర‌శ్నాప‌త్రం ఎవ‌రికీ తెలిసే ఛాన్సే లేద‌న్నారు. ఈసారి 5.51 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల ప‌రీక్ష‌లు రాయ‌నుండ‌గా, అంద‌రికీ బ‌యోమెట్రిక్ త‌ప్ప‌నిస‌రి చేశామ‌న్నారు. టీజీపీఎస్‌సీపై న‌మ్మ‌కముంచి అభ్య‌ర్థులు ప‌రీక్ష‌లు రాయాల‌ని, మెరిట్ ఉంటే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని బుర్రా వెంక‌టేశం చెప్పుకొచ్చారు.
2015లో గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ అమలుకు చాలా స‌మ‌యం తీసుకున్నారని, ఈసారి తొంద‌ర‌గానే ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌న్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుంగా ప‌ది రోజులుగా అన్ని అంశాల‌ను స‌మీక్షించిన‌ట్లు తెలిపారు.

Related Posts
పర్వతారోహణలో మన దేశం చిన్నారి సరికొత్త రికార్డు
kaamya

కామ్య కార్తికేయన్ అనే 17 ఏళ్ల యువతి, తాజాగా అద్భుతమైన సాహసానికి స్వస్తి పలికింది. ఈ యువతి, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మద్దతు పొందిన ఒక ప్రతిభావంతమైన Read more

Online Betting : ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం – సీఎం చంద్రబాబు
AndhraPradesh:కలెక్టర్ల సమావేశంలో తల్లికి వందనంపై కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో, ఆన్లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని Read more

అమెరికా కంపెనీ: ఉద్యోగుల భద్రతా కోసం కొత్త విధానం..
feedback

ఉద్యోగులు మరియు మేనేజర్ల మధ్య వ్యత్యాసాలు, అసంతృప్తి భావనలు పుట్టించడంలో సాధారణంగానే సమస్యలు ఉండవచ్చు. అయితే, ఒక అమెరికా కంపెనీ ఉద్యోగుల అసంతృప్తిని వినడానికి మరియు వాటిని Read more

డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..ప్రధాన చర్చ వీటిపైనే
telangana assembly session starts on dec 09

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ శాసనసభ, శాసనమండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10:30 Read more