Alerts

గ్రూప్-2 అభ్యర్థులకు ముఖ్య ప్రకటన

గ్రూప్‌ 2 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెల్‌, ఒరిజినల్‌ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు.
ఏర్పాట్లు పూర్తి
గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయిందని చెప్పారు. ఇప్పటికే నాలుగుసార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని అన్నారు. 5,51,847 మంది విద్యార్థులు గ్రూప్ 2 కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 1368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. 58 రీజనల్ కో అర్దినేటర్లను నియమించామన్నారు. పరీక్ష కోసం 65వేల మంది సిబ్బంది వివిధ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. 75 శాతం అభ్యర్థులు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. 783 ఉద్యోగాలకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి లోపు గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్ ఇస్తామని అన్నారు.

Related Posts
Instagram: ఇన్‌స్టాలో సాంకేతిక సమస్య.. సేవల్లో అంతరాయం
Technical problem on Instagram.. disruption in services

Instagram : ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థకు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఇన్‌స్టాగ్రామ్‌ ' సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా అమెరికాలో Read more

మరోసారి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు..
Once again notices to Ram Gopal Varma

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. Read more

ఉద్రిక్తతలకు దారితీసిన వైసీపీ ‘యువత పోరు’
yuvatha poru

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైసీపీ చేపట్టిన ‘యువత పోరు’ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు Read more

మిస్ వరల్డ్ – భారత్ తరఫున పోటీలో ఈమెనే
nandini gupta

ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ మిస్ వరల్డ్ ఈసారి భారతదేశంలోనే జరుగనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుండి 31 వరకు Read more