konda devara song

గేమ్ ఛేంజర్ నుంచి కొండ దేవర సాంగ్ వచ్చేసింది..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి, ఈ క్రమంలోనే మేకర్స్ ఇటీవల “కొండ దేవర” అనే పాటను రిలీజ్ చేశారు,ఇది యూట్యూబ్‌లో మంచి హైప్ తెచ్చుకుంటోంది.తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు శంకర్ ఈసారి తొలిసారిగా తెలుగులో గేమ్ ఛేంజర్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

konda devara song
konda devara song

రామ్ చరణ్ ఈ చిత్రంలో తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మూవీ నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ దాటాయి.తాజాగా విడుదలైన “కొండ దేవర” పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర”అనే సాహిత్యం చాలా బాగా కనెక్ట్ అవుతోంది.ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, తమన్ సంగీతం అందించారు.శ్రావణ భార్గవి పాటను మరింత ఆకట్టుకునేలా పాడారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని మరోసారి నటిస్తోంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్.జే. సూర్య, అంజలి, శ్రీకాంత్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ అప్పన్న అనే పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.ఈ సినిమా తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందనే ఆశతో టీమ్ ముందుకు వెళ్తోంది.సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ కావడంతో గేమ్ ఛేంజర్ భారీ వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts
Nandamuri Tarakaratna : తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. కుందనపు బొమ్మలా ఎంత బాగుందో
Nishka half saree ceremony

నందమూరి తారకరత్న అనే పేరు వినగానే ఆయన జీవితంలో అనేకమైన జ్ఞాపకాలు మెదలుతాయి. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ హీరో, కేవలం 39 ఏళ్ల Read more

డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్

ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్బంగా విడుదలకు సిద్ధమైన సినిమాల్లో డాకు మహారాజ్ ప్రధానంగా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన Read more

గ్లోబల్ స్టేజ్ పై అదరకొడుతున్న పుష్ప 2 పాటలు
గ్లోబల్ స్టేజ్ పై అదరకొడుతున్న పుష్ప 2 పాటలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై, అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు Read more

మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా?
mufasa movie

ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్‌కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన వార్తలతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులలో భారీ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా, మహేష్ Read more