CM is shocked at the death of Gussadi Kanakaraju. Funeral with official formalities

గుస్సాడీ క‌న‌క‌రాజు మృతిపై సీఎం దిగ్భ్రాంతి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

హైదరాబాద్‌: కొమ‌రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు, ప‌ద్మ‌శ్రీ క‌న‌కరాజు, అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ఆదివాసీల సంప్రదాయ ప్రకారం జరగనున్నాయి.

క‌న‌కరాజు మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ కళలకు తీరని లోటు అని పేర్కొన్నాడు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడం వంటి గొప్ప కృషిని క‌న‌కరాజు అందించాడు అని కొనియాడారు.

ఆదివాసీ కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన క‌న‌కరాజు మ‌ర‌ణం త‌న‌ను తీవ్రంగా కలిచివేసిందంటూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క‌న‌కరాజు అంత్యక్రియలను అధికారిక లాంఛనాల‌తో నిర్వహించాల‌ని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

కాగా, ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యం అందరినీ అలరిస్తూ వచ్చిన క‌న‌కరాజు ఈసారి పండుగకు కొన్ని రోజుల ముందు మరణించడంతో ఆదివాసీలు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రోత్సహించేందుకు చేసిన కృషికి 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప‌ద్మ‌శ్రీ పురస్కారం అందించిన విషయం తెలిసిందే.

Related Posts
మధ్యాహ్న భోజనంలో మార్పులు..చేసిన ఏపీ సర్కార్
Changes in midday meal

నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనం (డొక్కా సీతమ్మ బడి భోజనం)లో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు రావడం తోప్రభుత్వం అప్రమత్తమైంది. క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి Read more

ఆర్టీసీలోకి 3వేల ఎలక్ట్రిక్ బస్సులు – సీఎం రేవంత్
electric buses telangana

తెలంగాణలో పర్యావరణహిత రవాణాకు ప్రాధాన్యత ఇస్తూ, త్వరలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పటికే దేశవ్యాప్తంగా Read more

రేపు సెలవు – తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Holiday tomorrow - Announcement by Telangana Govt

తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు బ్యాంకులు Read more

నేడు ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్‌
ACB notices to KTR once again..!

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు దేశరాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. లగచర్ల దారుణాలను జాతీయ మీడియా ముందు చూపించనున్న కేటీఆర్.. కొడంగల్ లగచర్ల బాధితుల కోసం Read more