jagan gurla

గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి – జగన్

విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైస్ జగన్ అన్నారు. గుర్ల‌లో సెప్టెంబర్‌ 20వ తేదీన తొలి డయేరియా మృతి కేసు నమోదైతే 35 రోజులైనా ప్రభుత్వం స్పందించలేద‌ని, అక్టోబర్‌ 19వ తేదీన తాను ట్వీట్‌ చేసే వరకు ప్రభుత్వం స్పందించలేద‌ని జగన్ మండిప‌డ్డారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని అన్నారు. డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదు? స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని జగన్ ప్రశ్నించారు.

ఈరోజు గుర్ల గ్రామం, మండలంలో ప్రత్యేక పరిస్థితులు చూసి, గమనిస్తే, చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు కళ్లెదుటే కనిపిస్తాయి. మా ప్రభుత్వ హయాంలో గ్రామ స్వరాజ్యం తీసుకొస్తే, ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉంటే, ఈరోజు పరిస్థితి ఏమిటన్నది గమనించండి. నాడు మా హయాంలో గ్రామాలు చూస్తే.. ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపించేవి. అక్కడే వివిధ శాఖల వారు పని చేస్తూ కనిపించే ఉద్యోగులు ఉండేవారు. బడి పిల్లలు చక్కగా నవ్వుతూ కనిపించేవారు. మన గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు కనిపించేవి. సచివాలయాల్లో పంచాయతీరాజ్‌ శాఖలో పని చేసే వాళ్లు కనిపించే వాళ్లు. అక్కడే విద్యా శాఖ చూసే వాళ్లు కూడా కనిపించేవారు. ఈరోజు గుర్ల మండలం, గ్రామంలో జరిగింది ప్రజలంతా గమనించమని కోరుతున్నాను. రాష్ట్రంలో పరిస్థితి గమనించమని కోరుతున్నాని జగన్ తెలిపారు.

Related Posts
పవన్ సీఎం అంటూ జనసేన నేత షాకింగ్ కామెంట్స్
pavan

ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎంగా టీడీపీ నేత నారా లోకేష్ ను నియమించాలనే డిమాండ్లు ఈ మధ్య బలంగా వినిపించాయి. Read more

హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు
హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు

కేసరిపల్లి గ్రామం గన్నవరం మండలం, కృష్ణాజిల్లా నందు ది 05.01.2024 జరగబోవు హైందవ శంఖారావం మహాసభ పురస్కరించుకొని ఈ క్రింది విధంగా పోలీసులు ట్రాఫిక్ మల్లింపు చేయడమైనది.హైందవ Read more

లోకేష్ సీఎం… భరత్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం
లోకేష్ సీఎం... భరత్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి T.G. భరత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భవిష్యత్ Read more

“గేమ్ చేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌..ఇద్దరు యువకుల మృతి
bike accident

అప్పటివరకు ఎంతో హ్యాపీగా వున్న వారిద్దరూ విగతజీవులుగా మారిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగిల్చారు. ఎంతో భవిష్యత్తు వున్నవారు కనుమరుగై పోయారు. ఎదురుగా వచ్చిన వ్యాన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *