Attack on iron rod

గాజువాకలో దారుణం ..

ఏపీలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ప్రభుత్వం మారినాకని ప్రేమన్మధులు , కామాంధులు మారడం లేదు. ప్రతి రోజు అత్యాచారం , లేదా ప్రేమ వేదింపులు అనేవి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ వారు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. తాజాగా గాజువాక లో దారుణం జరిగింది.

పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీరజ్‌ శర్మ రాడ్‌తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలు గట్టిగ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని స్థానికులు హాస్పటల్ కు తరలించారు. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఆమె తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.

ఇక కాశ్మీర్ కి చెందిన యువకుడి నీరజ్ తో విశాఖ గాజువాక కు చెందిన మేఘనకు కొన్ని ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.. రాజస్థాన్ లో ఓ దైవ కార్యక్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత అతని ప్రవర్తన నచ్చక ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. దీంతో మేఘన మీద పగ పెంచుకున్న నీరజ్.. ఆమెను మానసికంగా హింసించసాగాడు. ఆమె ఫొటోలను న్యూడ్ ఫొటోలకు జతచేసి సోషల్ మీడియాలో మేఘన బంధువులకు పంపించేవాడు. దీనిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది. న్యూ పోర్ట్ పోలీసులకు నీరజ్ తో తమ కూతురుకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు బాధితురాలి తండ్రి పాపారావు. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో హెల్మెట్ పెట్టుకుని వచ్చి కూతురు తలపై ఒక రాడ్డుతో బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు.

Related Posts
రూ.80,500 కోట్ల అప్పు చేశారు.. అప్పు తప్పు అన్నోళ్లని దేనితో కొట్టాలి?: కేటీఆర్‌
ktr comments on cm revanth reddy

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం రేవంత్‌ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల Read more

Sunrisers Hyderabad: 6.4 ఓవర్లలో 100 పరుగులు చేసిన సన్ రైజర్స్
Sunrisers Hyderabad: సన్ రైజర్స్ బ్యాటింగ్: 6.4 ఓవర్లలోనే 100 పరుగుల ఘనత

గత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాదు బ్యాట్స్‌మన్‌లు అత్యద్భుత ప్రదర్శన చూపించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లోనూ వారు తమ మార్కు స్టైల్‌ను Read more

దోచుకున్న సొమ్ము బయటపెట్టు విజయసాయి – సోమిరెడ్డి
somireddy vijayasai

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి గతంలో చేసిన పనులు, Read more

మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల..!
మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల

కేంద్ర బడ్జెట్ 2025ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు కవి గురజాడ అప్పారావు ప్రసిద్ధ వచనం "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే Read more