vennela

గద్దర్ కూతురికి కీలక పదవి కట్టబెట్టిన రేవంత్ సర్కార్

గద్దర్‌ కూతురు డాక్టర్‌ గుమ్మడి వెన్నెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు డాక్టర్‌ వెన్నెలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ సెక్రటరి వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో గద్దర్ అభిమానులు, సాంస్కృతిక వేదికతో సంబంధాలున్న అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరైన వ్యక్తికి.. సరైన విభాగంలోని బాధ్యతలు అప్పగించారని ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయంతో.. ఓ వైపు సాంస్కృతిక రంగానికి ఏం చేయాలో చిన్నప్పటి నుంచి అవగాహన ఉన్న వ్యక్తిని నియమించారనే సంతృప్తితో పాటు.. ప్రజాభిమాన గాయకుడికి నివాళులు అర్పించినట్లైందని అంటున్నారు.

గద్దర్ సేవల్ని గుర్తిస్తూ.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే.. ఏటా సినిమాకు అందించే అత్యుత్తమ పురస్కారాలైన నంది అవార్డులకు.. గద్దర్ పురస్కారాలుగా పేరు మార్చి గౌరవించింది. హైదరాబాద్ లోని తెల్లాపూర్ పరిధిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, గద్దర్ పై అభిమానాన్ని చాటుకుంది. ఇప్పుడు.. ఆయన వారుసురాలికి మంచి పదవి ఇచ్చి.. మరోసారి సత్కరించుకుంది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక కళాకారులకు గుర్తింపు, ఉపాధిని కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేశారు. ఇందులోని కళాకారులు కళాబృందాలుగా ఏర్పడి సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రచారం చేయిస్తారు. కళా ప్రదర్శనలకు అనువైన శిక్షణనివ్వడానికి, వర్క్ షాపులు నిర్వహించడానికి సాంస్కృతిక సారథి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తుంది. గ్రామ గ్రామాన అట్టడుగు స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేరేలా వ్యవహరిస్తారు.

Related Posts
నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం
ntr cinema vajrotsavam

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు నందమూరి తారకరామారావు నటుడిగా అరంగేట్రం చేసిన మనదేశం సినిమాకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో సినీ Read more

ప్రభుత్వ స్కూళ్లకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్
AP govt

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.1450 కోట్లతో స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లులు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య ప్రకటించారు. Read more

17.1 మిలియన్ల ఓటర్లతో శ్రీలంకలో స్నాప్ ఎన్నికలు: ఫలితాలు శుక్రవారం
vote

శ్రీలంకలో 17.1 మిలియన్ల మంది ఓటర్లు గురువారం పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొననున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న ఏడు వారాల తర్వాత ఈ స్నాప్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ Read more

డేటా ఇంజినీరింగ్లో 3 నెలలు ఉచిత శిక్షణ – మంత్రి శ్రీధర్ బాబు
We will create more jobs in IT.. Minister Sridhar Babu

తెలంగాణ రాష్ట్ర యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డేటా ఇంజినీరింగ్‌లో 90 రోజుల ఉచిత శిక్షణను అందించనుంది. టాస్క్ (Telangana Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *