brs leaders visited gangula

గంగుల కమలాకర్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ లీడర్స్

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, జోగు రామన్న తదితరులు పరామర్శించి, ఆయన మాతృమూర్తి గంగుల లక్ష్మీ నర్సమ్మ మరణానికి నివాళులు అర్పించారు. గురువారం కరీంనగర్‌లో గంగుల కమలాకర్ నివాసానికి వెళ్లి, లక్ష్మీ నర్సమ్మ(85) చిత్ర పటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

గంగుల లక్ష్మీ నర్సమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం కరీంనగర్‌లోని గంగుల నివాసంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నివాళులు అర్పించిన వారిలో మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు డా. గాదరి కిశోర్ కుమార్, ఎన్ భాస్కర్ రావు, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, కోరుకంటి చందర్, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ విజయ, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్శనతో గంగుల కమలాకర్‌కు మద్దతు మరియు కుటుంబానికి సంఘీభావం చాటారు.

Related Posts
ఇందిరమ్మ ఇళ్లు.. వారి ఖాతాల్లోకి రూ.లక్ష?
Indiramma houses

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో సుమారు 4.5 Read more

మూసీ నిద్ర ప్రారంభించిన బిజెపి నేతలు..
bjp musi nidra

మూసీ పరివాహక ప్రాంతాల్లో "బీజేపీ మూసీ నిద్ర" కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయాల్లో మూసీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మూసి సుందరీకరణ పేరుతో మూసి వాసుల Read more

ఈ నెల 8 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: సిఎం రేవంత్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. Read more

స్పందన లేకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తాం: పోలీస్ కమిషనర్
mohan babu 1

సినీ నటుడు మోహన్ బాబు విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతోందని… అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ప్రస్తుతం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *