ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం

ఖో-ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం

ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన పురుషుల ఖో-ఖో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.నేపాల్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 54-36 తేడాతో గెలిచింది.ఇదే మొదటి ఖో-ఖో ప్రపంచ కప్, అది కూడా పురుషుల, మహిళల విభాగాల్లో భారత జట్టు టైటిళ్లను కైవసం చేసుకోవడం విశేషం.ఫైనల్ మ్యాచ్ టాస్ గెలిచిన నేపాల్ డిఫెన్స్‌ను ఎంచుకుంది.కానీ, భారత జట్టు ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. తొలి టర్న్‌లోనే భారత జట్టు 26 పాయింట్లు సాధించి ఆధిక్యంలో నిలిచింది.రెండో టర్న్‌లో నేపాల్ 18 పాయింట్లు చేసినా, టీమ్ ఇండియా ఆధిక్యాన్ని కొనసాగించింది.చివరి టర్న్‌లో భారత జట్టు 54 పాయింట్లతో భారీ స్కోరు సాధించి మ్యాచ్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది.పురుషుల ఖో-ఖో ప్రపంచ కప్‌లో 20 జట్లు పోటీపడగా, భారత జట్టు గ్రూప్ దశ నుంచే అజేయంగా కొనసాగింది.

ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం
ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం

గ్రూప్ Aలో భారత జట్టు నేపాల్, బ్రెజిల్,పెరూ,భూటాన్ వంటి జట్లను ఎదుర్కొంది. ప్రతి మ్యాచ్‌లోనూ భారత జట్టు తన పటిష్ఠతను ప్రదర్శించింది.గ్రూప్ స్టేజ్‌లోనే నేపాల్‌పై 42-37తో గెలిచిన భారత్, ఫైనల్‌లో కూడా తమ దూకుడును కొనసాగించింది.నాకౌట్ దశలో కూడా భారత జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. క్వార్టర్ ఫైనల్‌లో శ్రీలంకను 100-40తో ఓడించి,సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 60-18 తేడాతో గెలుపొందింది. ఈ విజయం జట్టును ఫైనల్‌లోకి నడిపించింది, అక్కడ కూడా తమ ఆధిపత్యాన్ని నిరూపించింది.మహిళల విభాగంలో కూడా భారత జట్టు టైటిల్‌ను గెలుచుకోవడం సంతోషకర విషయమని చెప్పాలి.

ఫైనల్లో మహిళల జట్టు కూడా నేపాల్‌ను ఓడించి తన సత్తా చాటింది.ఈ విజయాలు భారత ఖో-ఖోకు గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చాయి. పురుషుల, మహిళల విభాగాల్లో భారత జట్ల ఆధిపత్యం ఆటలో వారి నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. భారత జట్టు విజయం ఖో-ఖో ఆటను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి మరింత ప్రేరణనిచ్చింది.

Related Posts
ప్రియురాలి త‌ల్లిపై దాడి చేసిన ప్రియుడు
boy friend attack

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం సుద్దాలపల్లి గ్రామంలో ఒక యువకుడు తన ప్రియురాలి తల్లిపై దారుణంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమకు అడ్డుగా నిలిచిందనే Read more

IBPS PO 2024 రిజల్ట్: ప్రిలిమ్స్ ఫలితాలు, కట్ ఆఫ్ మార్కులు విడుదల!
ibps po result

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) పిఓ (ప్రొబేషనరీ ఆఫీసర్) 2024 ప్రిలిమినరీ పరీక్ష రిజల్ట్స్ మరియు కట్ ఆఫ్ మార్కులు త్వరలో విడుదల కానున్నాయి. Read more

నేడు కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ
Cabinet meeting today..discussion on key issues

హైదరాబాద్‌: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్న 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. కాగా ఈ Read more

రేపు స్కూళ్లకు సెలవు
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

ఆంధ్రప్రదేశ్‌లో MLC ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు (ఫిబ్రవరి 27) సెలవు ప్రకటించారు. ముఖ్యంగా గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *