ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం సినిమాలు,వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.కోలీవుడ్‌లో నాయికా ప్రాధాన్యమైన పాత్రలు అనగానే నయనతార, త్రిష తర్వాత పేరు వినిపించేది ఐశ్వర్య రాజేశ్‌దే.ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతున్నాయి.ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఆమె నటించిన ‘సుడల్ది వొర్టెక్స్‘ ప్రేక్షకులను ఆకట్టుకుంది.2022లో విడుదలైన ఈ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.బ్రహ్మ-అనుచరణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్‌గా రూపొందింది.ఇందులో కథిర్, గౌరీ కిషన్,మంజిమా మోహన్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌తో’సుడల్’ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఫిబ్రవరి 21 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుందని సమాచారం.సీజన్ 1 కథను చూద్దాం. ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం గ్రామాన్ని కలిచివేస్తుంది.ఈ ప్రమాదానికి ఫ్యాక్టరీ యూనియన్ నాయకుడు షణ్ముగం కారణమని గ్రామస్థులు అనుమానిస్తారు.ఇదే సమయంలో షణ్ముగం చిన్నకూతురు నీల ప్రేమించిన వ్యక్తితో పాటు మృతదేహంగా చెరువులో కనిపిస్తుంది.ఇది ఆత్మహత్య కాదని తెలుసుకున్న నీల అక్క (ఐశ్వర్య రాజేశ్) ఈ మిస్టరీని ఛేదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనేదే కథ.
ఇప్పుడు సీజన్ 2 ఎక్కడి నుంచి మొదలవుతుందో చూడాల్సి ఉంది.గతంలో సీజన్ 1 ఎంత మంచి విజయాన్ని సాధించిందో, సీజన్ 2 కూడా ప్రేక్షకులను అలరించగలదని అభిమానులు ఆశిస్తున్నారు.ఐశ్వర్య రాజేశ్ మళ్లీ తన నటనతో ఆకట్టుకుంటుందా? ఈసారి కథలో ఎలాంటి మలుపులు ఉంటాయో చూద్దాం.’సుడల్’ సీజన్ 2కి సంబంధించిన అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఐశ్వర్య రాజేశ్ మళ్లీ అలరిస్తుందని అనడంలో సందేహం లేదు. ఫిబ్రవరి 21ను ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది నిజమైన థ్రిల్ అనిపించనుంది.