Kaushik Reddy

కౌశిక్ రెడ్డిపై 3 కేసులు

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం కూడా ఫిర్యాదు చేయగా.. ఆయన ఫిర్యాదు మేరకు మూడో కేసు నమోదు చేశారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌ టౌన్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Advertisements


రసాభాసగా మారిన సమావేశం
ఆదివారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే జిల్లా ఇంచార్జ్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుపడ్డారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్‌ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ ఒకర్నొకరు తోసుకొని కొట్టుకున్నంత పని చేశారు. మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు సమక్షంలోనే గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ్నుంచి తరలించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Related Posts
తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్
drink and drive

తెలంగాణలో మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లో జరిగిన ఘటనలో మద్యం తాగి కారు నడిపిన వ్యక్తి.. బైకుపై Read more

చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు భారీ జరిమానా
BRS Ex MLA Chennamaneni Ram

తెలంగాణ హైకోర్టు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఈ నిర్ణయం చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు ధ్రువీకరించడంతో Read more

రేవంత్ 14 నెలల పాలన పై కిషన్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు
1629299 kishan reddy

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్రమంత్రి మరియు బీజేపీ నేత కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు Read more

Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం
Akbaruddin విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం అక్బరుద్దీన్ ఆగ్రహం

Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అమలైన "మన ఊరు - మన బడి" కార్యక్రమంపై Read more

×