కోడి పందాలు ప్రారంభించిన రఘురామ

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తన నియోజకవర్గంలో కోడి పందాల్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత సొంత నియోజకవర్గం ఉండిలో ఆయన భోగి వేడుకలు నిర్వహించారు. అంతే కాదు సంక్రాంతి సందర్భంగా జరిగే సంప్రదాయ కోడి పందాల్లోనూ పాల్గొన్నారు. సహ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురిని తన నియోజకవర్గానికి ఆహ్వానించి మరీ సంబరాల్లో భాగస్వాముల్ని చేస్తున్నారు.


ప్రతీ ఏటా సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కోడి పందాలు జరుగుతాయి. అయితే సంప్రదాయ కోడి పందాలకు గతంలో సుప్రీం కోర్టు వరకూ వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు.. ఇవాళ తన నియోజకవర్గంలో కోడి పందాల్ని ప్రారంభించారు. తన కోడితో గంటా శ్రీనివాస్ పుంజుతో ఈ పోటీని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరం గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో వీటిని నిర్వహిస్తున్నారు.కోళ్లకు కత్తులు లేకుండా జరుగుతున్న డింకీ పందాల్లో భాగంగా ఇలా రఘురామ పాల్గొన్నారు.
జూదం లేకుండా కోళ్లకు కత్తులు కట్టకుండా సంప్రదాయ కోడి పందాలు నిర్వహించడం రఘురామకు ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గతంలోనూ ఆయన వరుసగా కోడి పందాలు నిర్వహించడం, పాల్గొనడం చేసే వారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం రఘురామను పూర్తిగా టార్గెట్ చేయడంతో కోడి పందాలకు, సంక్రాంతి వేడుకలకు, సొంత నియోజకవర్గానికి కూడా ఆయన దూరమయ్యారు. కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు రఘురామకు తిరిగి స్వేచ్ఛ లభించింది.

Related Posts
సరస్వతి పవర్ సంస్థ భూములకు అనుమతులు ఉన్నాయా? – పవన్
pawan kalyan to participate in palle panduga in kankipadu

పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థ (Saraswati Power Company)కు సంబంధించిన భూములకు అనుమతులున్నాయా లేదా అనే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ Read more

అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
New law in AP soon: CM Chandrababu

రాష్ట్రంలో భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు సహా పలు జిల్లాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా Read more

స్విగ్గీ బాయ్ కట్ నిర్ణయం వెనక్కి
swiggy ap

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా Read more

పాతపట్నంలో ఆవుపై దాడి చేసిన పెద్దపులి
tiger attacked a cow

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాతపట్నం మండలంలోని తీమర గ్రామ సమీపంలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఆవును Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *